హిందీ మార్కెట్ లో బ‌న్నీ ఒకే..చెర్రీ-తారక్ నెక్స్ట్!

Update: 2021-12-29 00:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి విశేష అద‌ర‌ణ ల‌భిస్తోంది. కోలీవుడ్ లో టాలీవుడ్ ని మించి స‌క్సెస్ అయింది. త‌మిళం..మ‌ల‌యాళం లోనూ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే మొద‌ట్లో హిందీలో సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు మ‌ళ్లీ `పుష్ప` అక్క‌డ పుంజుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. మొద‌ట్లో ఉత్త‌రాదిన `పుష్ప` థియేట‌ర్లు వెల‌వెల‌బోయినా త‌ర్వాత కంటెంట్ గ‌ల సినిమా గా ప్ర‌మోట్ అవ్వ‌డంతో జ‌నాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

దీంతో థియేట‌ర్ల సంఖ్య పెంచుతున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే హిందీ సినిమాల‌కే `పుష్ప` పోటీనిస్తుందని టాక్ వినిపిస్తుంది. బ‌న్నీకి ఇదే తొలి హిందీ ఎంట్రీ మూవీ అయినా కంటెంట్ తో జ‌నాల్ని థియేట‌ర్ వైపు కి ర‌ప్పించ‌గ‌లుగుతున్నాడు. నిజానికి ఇది పాన్ ఇండియా రిలీజ్ అయినా హిందీలో ప్ర‌మోట్ చేయాలేదు. నేరుగా ముంబై వెళ్లి అక్క‌డ ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు రిలీజ్ చేయ‌లేదు. కేవ‌లం తెలుగులో మాత్ర‌మే ప్ర‌మోట్ చేసి రిలీజ్ చేసారు. దీంతో మొద‌ట్లో ఆడియ‌న్స్ సినిమా గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. నెమ్మ‌దిగా మౌత్ టాక్ పాజిటివ్ గా రావ‌డంతో ప్రేక్ష‌కులే థియేట‌ర్ రావ‌డం అన్న‌ది విశేషం.

దీన్ని నిజంగా హిందీలో బ‌న్నీ రియ‌ల్ స‌క్సెస్ గా చెప్పొచ్చు. బ‌న్నీకి అక్క‌డ ఎలాంటి ఇమేజ్ లేదు. కేవ‌లం తెలుగు న‌టుడిగానే సుప‌రిచితుడు. ఇప్పుడు `పుష్ప‌`తో అక్క‌డా త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. `పుష్ప` పార్ట్ -2 కి ఈ స‌క్సెస్ ఎంతో కీల‌కం అని చెప్పొచ్చు. రెండ‌వ భాగాన్ని హిందీ మార్కెట్ లో పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తే మంచి వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ ఇలా తొలి పాన్ ఇండియా చిత్రంతో బాలీవుడ్ మార్కెట్ లో నిరూపించుకున్నాడు. త‌దుప‌రి `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ తో రామ్ చ‌ర‌ణ్‌.. తార‌క్ కూడా ప్రూవ్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించ‌డంతో హిందీ లో భారీ బ‌జ్ ఉంది. ఆశించిన విధంగా ఉత్త‌రాది న వ‌సూళ్ల‌ను కొల్ల‌గొడితే చ‌ర‌ణ్‌.. తార‌క్ కి ఇది పెద్ద ప్ల‌స్ గా మారుతుంది.
Tags:    

Similar News