ట్రోలర్ల నోళ్లు మూయించిన బన్నీ..!

Update: 2022-09-12 05:32 GMT
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణంరాజు.. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు. అలానే ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

కృష్ణ - చిరంజీవి - మోహన్ బాబు - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ వంటి స్టార్స్ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించడమే కాదు.. జూబ్లీ హిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కృష్ణంరాజు మరణంపై ట్వీట్ చేయకుండా.. తనకు సైమా అవార్డ్ దక్కడం పై పోస్ట్ పెట్టడంపై ట్రోల్స్ వచ్చాయి.

సైమా అవార్డ్స్ అందుకున్న మిగతా నటీనటులంతా సీనియర్ నటుడి మరణ వార్త విని, తమ అవార్డుల గురించి ట్వీట్ చేయలేదు.. కానీ బన్నీ ఎందుకు ఇలా చేసాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. రియల్ లైఫ్ లో ప్రభాస్ మరియు బన్నీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అలాంటిది ఆయన పెదనాన్న మృతిపై సంతాపం ప్రకటించకుండా.. తన అవార్డ్ గురించి పేర్కొందమేంటని ఓ వర్గం నెటిజన్లు అల్లు అర్జున్ పై మండిపడ్డారు.

సైమా కోసం బెంగుళూరు వెళ్లిన విజయ్ దేవరకొండ - నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలు కూడా హైదరాబాద్ వచ్చి కృష్ణంరాజు పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తే.. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ కూడా పెట్టలేకపోయాడని విమర్శించారు. అయితే బన్నీ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించడమే కాదు.. ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.

హైదరాబాద్ కు వచ్చిన వెంటనే నేరుగా ప్రముఖ నటుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు అల్లు అర్జున్. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కఠిన సమయంలోనూ తన స్నేహితుడు ప్రభాస్ మొహంలో నవ్వు కనిపించేలా చేసాడు. దీంతో విమర్శించిన నెటిజన్ల నోళ్లన్నీ మూతపడ్డాయి.

ఇకపోతే ఇవాళ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో కృష్ణం రాజు అంత్యక్రియలు జరగనున్నాయి. చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అంతిమ యాత్రలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News