బ‌న్నీ టార్గెట్ 1000 కోట్లు..అదీ 'పుష్ప‌-2' రేంజ్!

Update: 2022-12-12 13:30 GMT
బాక్సాఫీస్ వ‌ద్ద బ‌న్నీ  ప‌ర్స‌న‌ల్ టార్గెట్ ఫిక్సైందా? 1000 కోట్ల వ‌సూళ్లు మార్క్ చేసి పెట్టుకున్నాడా?  బాక్సాఫీస్ వ‌ద్ద టాప్-4 లో తానే ఉండాల‌ని డిసైడ్ అయ్యాడా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. ఇది బన్ని వ్య‌క్తిగ‌త టార్గెట్ మాత్ర‌మే.  ఆ టార్గెట్ కి-టీమ్కి ఎలాంటి సంబంధం లేదు. ద‌ర్శ‌కుడు సుకుమార్ గార్గెట్ వేరే ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ క‌హాని ఇందంతా మ‌రో క‌థ‌.

వాటితో బ‌న్నీకి సంబంధం లేదు. నెంబ‌ర్ -4 లో నిల‌వాల‌న్న ల‌క్ష్యంతోనే 'పుష్ప‌-2' దించేలా బ‌న్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓ అగ్ర నిర్మాత కుమారుడిగా ఆ మాత్రం మార్కెట్ ని బ‌న్నీ అంచ‌నా వేయ‌గ‌ల స‌మ‌ర్ధుడు అన్న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 'పుష్ప ది రైజ్' మొద‌టి భాగం 350 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫిగ‌ర్ ని  టీమ్ స‌హా ఎవ‌రూ ఊహించలేదు.

పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమా ఆ రేంజ్ లో స‌క్సెస్ అవుతుంద‌ని ఏ మాత్రం ఊహించ‌లేద‌నిది. అనూహ్యంగా హిందీ బెల్ట్ కి క‌నెక్ట్అవ్వ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర‌ద పారింది. ఈ ఒక్క కార‌ణంతోనే రెండ‌వ భాగాన్ని ఏకంగా అంత‌ర్జాతీయ‌ రేంజ్ లో  ప్లాన్ చేసి బ‌రిలోకి దించుతున్నారు. అవ‌స‌ర‌మైన స‌రంజామా మొత్త  సిద్దం చేసి..క‌థ స‌హా యూనివ‌ర్శ‌ల్ గా క‌నెక్ట్అయ్యేలా ప్లాన్ చేసుకుని లెక్క‌లు మాష్టారు కంటెంట్ ని  నిదించుతున్నారు.

ఇది పూర్తిగా సుకుమార్ లెక్క‌. వ‌ర‌ల్డ్ వైడ్   బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత సాధిస్తుంద‌న్న‌ది ఆయ‌న లెక్క వ్య‌క్తిగ‌తంగా ఉంది.  అయితే బ‌న్నీ మాత్రం 1000 కోట్ల‌గా ఫిక్సైన‌ట్లు తెలుస్తోంది. తొలి భాగానికి వ‌చ్చిన వ‌సూళ్లు...రెండ‌వ భాగంపై నెలకొన్న‌ బ‌జ్ ని  బేస్ చేసుకునే బ‌న్నీ ఈ ఫిగ‌ర్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది.  రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ ఇద్ద‌రు క‌లిస్తే 1000 కోట్లు తెచ్చారు.

కేజీఎఫ్ -2 తో య‌శ్ 1200 కోట్లు  కొల్ల‌గొట్టాడు? ఆ ముగ్గురు సాధించ‌లేనిది   నేను ఒక్క‌డినే సోలోగా 1000 కోట్లు తేలేనా? అన్న అంచ‌నాలు..న‌మ్మ‌కంతో   బ‌న్నీ   బ‌రిలోకి దిగుతున్నాడు. రాజమౌళి..ప్ర‌శాంత్ నీల్ సాధించిన ఘ‌న‌త మా  సుకుమార్ సాధించ‌లేడా? అన్న న‌మ్మ‌కంతో 1000 కోట్లు టార్గెట్ ఫిక్స్  అయింది.  కంటెంట్ క్లిక్ అయితే  1000 కోట్లు ఏంటి? అంత‌కు మించి స‌త్తా చాటుతాన‌ని కాన్పిడెంట్ గా ఉన్నాడు బ‌న్నీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News