హీరోలకి కథలు వినిపించడం కష్టం .. వాళ్లు అడిగే పారితోషికాలు వినేసి తట్టుకోవడం కష్టం. ఒక సినిమా బడ్జెట్ 100 కోట్లు అనుకుంటే అందులో సగం హీరో పారితోషికమే అనే మాట వినిపిస్తూ ఉంటుంది. స్టార్ హీరోలు తమ సినిమా హిట్ కాగానే వెంటనే పారితోషికం పెంచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
సినిమా ఆడినా ఆడకపోయినా హీరోలకి సంబంధం లేదు. అందరికంటే ముందే వాళ్లకి వెళ్లవలసిన ఎమౌంట్ వెళ్లిపోతుంది. అందువలన నిర్మాతల సంగతిని గురించి వాళ్లు ఏ మాత్రం ఆలోచన చేయరని చెప్పుకుంటున్నారు.
సినిమాకి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది నిర్మాతలు హీరోల పారితోషికాలను గురించిన ప్రస్తావన తీసుకొస్తుంటారు. వాళ్లంతా తమ పారితోషికాలు తగ్గించుకోవాలంటూ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలావరకూ తగ్గిపోవడంతో, ఆ ప్రభావం వసూళ్లపై పడుతోంది. దాంతో మళ్లీ హీరోల పారితోషికాల టాపిక్ తెరపైకి వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై నిర్మాత బన్నీవాసు స్పందించాడు.
"ఈ రోజుల్లో ఆడియన్స్ ఏ సినిమాను థియేటర్లో చూడాలి .. ఏ సినిమాను ఓటీటీలో చూడాలనే విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఆడియన్స్ థియేటర్స్ కి తీసుకుని రావడమనేది ఇప్పుడు ఒక పరీక్షగా మారింది. పెద్ద సినిమాల కోసమే థియేటర్స్ కి వస్తారనే అభిప్రాయం తప్పు.
చిన్న సినిమాలే అయినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉందనిపిస్తే వస్తున్నారు. ప్రేక్షకుడి ఇంట్లోకి సినిమాను పంపించేసి వాళ్లు థియేటర్లకు రాకుండా చేసుకుంది నిర్మాతలే. హీరోల పారితోషికాల ఎఫెక్ట్ ఇండస్ట్రీపై పడుతుందని అనుకుంటున్నారుగానీ అందులో నిజం లేదు.
ఈ రోజుల్లో చిన్న హీరోలైనా .. పెద్ద హీరోలైనా నిర్మాతల సమస్యలను అర్థం చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి ఇబ్బంది ఉంటే, తమ రెమ్యునరేషన్ తరువాత ఇవ్వమనే అంటున్నారు. ఆ సినిమాలు ఆడకపోతే పారితోషికాలు వదిలేసుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. హీరోలు ఇంత తీసుకుంటున్నారట అనే ఒక నెంబర్ హైప్ కోసం చెప్పే మాటనే. ఎవరో ఒకరిద్దరు హీరోలు తప్ప మిగతా హీరోలు పారితోషికం విషయంలో పట్టుబట్టరు. మేకర్స్ కీ .. హీరోలకు మధ్య ఒక మంచి రిలేషన్ ఇండటం వల్లనే తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు వెళుతున్నాయి" అని ఆయన చెప్పుకొచ్చాడు.