హాస్య చిత్రాలతో పేరు తెచ్చుకున్న రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా చేస్తున్న తొలి ప్రయత్నం బుర్రకథ. ఈ నెల 28న విడుదల కాబోతున్న సందర్భంగా ఇందాకా ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈవెంట్ లో వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు. కథను క్లుప్తంగా చెప్పేసిన తీరు ఆసక్తి రేపెలా ఉంది. శరీరం ఒకటే అయినా అతని(ఆది సాయి కుమార్)లో రెండు బుర్రలు ఉంటాయి. ఒకదాని పేరు అభి రెండోదాని పేరు రామ్. ఒక బుర్ర ఒకసారి సాత్వికంగా ఉండేలా చేస్తే మరో బుర్ర ఇంకోసారి అతని నేటి యువతరానికి ప్రతినిధిగా కొత్తగా చూపిస్తుంది.
తండ్రి(రాజేంద్రప్రసాద్)ఎంత ప్రయత్నించినా డాక్టర్(పోసాని కృష్ణమురళి)ని సంప్రదించినా ప్రయోజనం ఉండదు. వీళ్ళ జీవితం ఇలా సాగిపోతూ ఉండగా ఊహించని విధంగా ఓ విలన్(అభిమన్యు సింగ్)ఎంటర్ అవుతాడు. అప్పటి నుంచి ప్రమాదాలు వెంటాడుతాయి. మరి రెండు బుర్రలతో రోజుకో యుద్ధం చేసిన అభిరామ్ లైఫ్ చివరికి ఏ మజిలీ చేరుకుందో అదే అసలు కథ
ట్రైలర్ ని బట్టి చూస్తే బుర్రకథని ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. రెండు బుర్రలతో రేగే అయోమయం వల్ల వచ్చిన కామెడీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. అతని తండ్రిగా రాజేంద్రప్రసాద్ కు మరోసారి స్పాన్ ఉన్న పాత్ర దక్కింది. హిరోయిన్ మిస్థీ చక్రవర్తి గ్లామర్ తో పాటు వన్ అవర్ మదర్ థెరెసాగా నవ్వులు పూయించే ప్రయత్నం చేసింది. ఇంకో హీరొయిన్ నైరా షా కూడా ఉంది.
రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని సింక్ అయ్యేలా కుదిరాయి. కొద్దిరోజుల క్రితమే వచ్చిన సాహో స్పూఫ్ ని 30 ఇయర్స్ పృథ్వితో చేయించడం పేలడమే కాదు ఇంత అప్ డేట్ గా తీసారా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి బుర్రకథలో కథ చాలానే ఉందనిపించేలా ఉన్న ఈ సినిమా శుక్రవారమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.
Full View