నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ మూవీ గౌతమిపుత్రశాతకర్ణిలో ఆకర్షణలు చాలానే ఉన్నాయి. బాలయ్య వందో చిత్రం.. క్రిష్ దర్శకత్వం.. 17 శతాబ్దాల క్రితం నాటి కథ.. అమరావతిని రాజధానిగా చేసుకుని అఖండ భారతాన్ని ఏలిన చరిత్ర.. శాతకర్ణిని అంతటి వీరుడిగా తీర్చిదిద్దిన తల్లి గౌతమీ బాలాశ్రీ.. ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న శాతకర్ణి చరిత్రను చెప్పేందుకు.. దర్శకుడు క్రిష్ కూడా అధ్భుతమైన గ్రాఫిక్స్ తో పాటు.. మంచి నటీనటులను కూడా ఎంచుకుని వారితో ఆయా పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు.
రీసెంట్ గా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. శాతకర్ణి చిత్రంలో ఈయన కూడా ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శాతకర్ణిని ప్రస్తుతిస్తూ వచ్చే ఓ బుర్రకథ పాట సిట్యుయేషనల్ గా వస్తుంది. దీనిలోనే శివరాజ్ కుమార్ నటించారు. పాట ట్యూన్.. బీట్ కు తగ్గట్లుగా నర్తిస్తూ అలరించారు శివరాజ్ కుమార్. తనే ఓ పెద్ద హీరో అయినా.. కథ కోసం.. సినిమా కోసం.. కేవలం ఓ పాటలో నటించేందుకు నటించిన శివరాజ్ కుమార్ ను అభినందించాల్సిందే. అయితే.. ఈపాట చిత్రీకరించిన తీరు.. అందులో ఆయన నటనలతో కూడా మేకింగ్ వీడియో చూస్తే.. ఈ పాత్రకు శివరాజ్ కుమార్ ఏ స్థాయిలో న్యాయం చేశారో అర్ధమవుతుంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/