ఒకే రోజు మూడు సినిమాలంటే ఇంకా పెద్దగా చెప్పేదేముంటుంది. ధియేటర్ల దగ్గర సందడి మాట అటుంచితే.. ధియేటర్ల పంపకం దగ్గర మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి అంతే. అందుకే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా వస్తున్న సినిమాల్లో ఒకదాని డేట్ మార్చాలంటూ రచ్చ చేస్తున్నారు బయ్యర్లు. పైగా ఆ రెండు సినిమాలకూ ఒకరే పంపిణీదారుడు కావడంతో ఇంకా అగ్గి రాజుకుంటోంది.
నితిన్ 'లై' .. బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక'.. రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఒకటే రోజున వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలనే చూస్తున్నాయి. వీటిలో లై మరియు జయ జానకి నాయక సినిమాలను దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఈ మూడు సినిమాల క్లాష్ ను కాస్త తగ్గించాలంటే ఖచ్చితంగా దిల్ రాజు ఒక సినిమా డేట్ మారిస్తే సరిపోతుంది. అందుకే జయ జానకి నాయక సినిమాను 11న కాకుండా 10న తీసుకురావాలంటూ బయ్యర్లు పట్టుపడుతున్నారట.
ఇకపోతే ఇప్పటికే ధియేటర్లను చాలా తెలివిగా ఈ ముడు సినిమాల మధ్యన షేర్ చేసినప్పటికీ.. చాలా చోట్ల ఎగ్జిబిటర్లు సోమవారం నాటికి ఏ సినిమాకు మాంచి టాక్ వస్తే ఆ సినిమాను ధియేటర్లో వేస్తాం అంటున్నారట. వారి బిజినెస్ స్కీము వారిది మరి. చూద్దాం వచ్చేవారం ఎవరిది పైచేయి అవుతుందో!!