#గుస‌గుస‌.. మ‌గ‌ధీర- బాహుబ‌లి క‌ల‌యిలో భారీ పాన్ ఇండియా మూవీ?

Update: 2021-08-15 06:30 GMT
టాలీవుడ్ లో తొలిత‌రం పాన్ ఇండియా చిత్రంగా క్లాసిక్ డేస్ లో `మాయా బ‌జార్`(1957) సంచ‌ల‌నం సృష్టించింది. ఘ‌టోత్క‌చునిగా విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీఆర్ (సామ‌ర్ల వెంక‌ట రంగారావు) న‌ట‌న .. రాకుమారిగా సావిత్రి అద్భుత న‌ట‌నాభినివేశ‌నం.. ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి ఉద్ధండుల అండ‌దండ‌లు.. ఆ సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాయి. దేశ విదేశాల్లో ఎన్నో అంత‌ర్జాతీయ అవార్డులు అందుకుని చాలా దేశాల్లో ప్ర‌ద‌ర్శిత‌మైన అద్భుత క‌ళాఖండ‌మిది. ఖండాంత‌రంలో ఫిలింస్కూల్ విద్యార్థులు స్క్రీన్ ప్లే గ్రంధంగా ఇప్ప‌టికీ ఈ సినిమాని అధ్య‌య‌నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి.

ఆ త‌ర్వాత చాలా క్లాసిక్స్ తెలుగు సినిమా హిస్ట‌రీలో ఉన్నాయి. స్వ‌దేశీ విదేశీ ఆడియెన్ ని మెప్పించిన చిత్రాలు ఉన్నాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర‌కు మ‌ళ్లీ ఒక రేంజులో పాన్ ఇండియా అప్పీల్ వ‌చ్చింది. ఆ సినిమాని ప‌లు భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేయ‌గా ఆద‌ర‌ణ ద‌క్కింది. చ‌ర‌ణ్ న‌టించిన రెండో సినిమాగా మ‌గ‌ధీర‌ ఒక సంచ‌ల‌నం. ఎస్.ఎస్.రాజ‌మౌళికి ఈ సినిమా గొప్ప ఖ్యాతిని తెచ్చి పెట్టింది. అటుపై ప్రభాస్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ లో బాహుబ‌లి ఫ్రాంఛైజీ తెలుగు సినిమా ద‌శ దిశ‌ను మార్చేసింది. జాతీయ సినిమాకే పాఠాలు నేర్పిన అరుదైన పాన్ ఇండియా చిత్ర‌మిది. ప్ర‌భాస్ కి అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని తెచ్చిన ఫ్రాంఛైజీగా రికార్డుల‌కెక్కింది.

ఇప్పుడు మ‌గ‌ధీర - బాహుబ‌లి క‌ల‌యిక‌లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నుంద‌న్న క‌థ‌నాలు హీట్ పెంచుతున్నాయి. ప్ర‌భాస్- చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తే చూడాల‌ని అభిమానులు చాలా కాలంగా వెయిటింగ్. కానీ ఇప్ప‌టికి ఈ కాంబినేష‌న్ వీలుప‌డుతోందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్- రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ పై సెలెంట్ గా వ‌ర్క్ సాగుతోంది. ప్రభాస్ స్నేహితుల బ్యాన‌ర్ యువి క్రియేషన్స్ ఈ క‌ల‌యిక‌లో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. ప్రభాస్- చరణ్ ఇద్దరినీ క‌లిపి అసాధార‌ణ బ‌డ్జెట్ తో మ‌రో లెవ‌ల్ సినిమాకి యువి సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు అగ్ర తారలను ఒకచోట చేర్చి అభిమానులకు గొప్ప విజువ‌ల్ ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ప్ర‌భాస్ .. చ‌ర‌ణ్ ఇద్ద‌రికీ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు ఉంది. అది ఈ సినిమా బిజినెస్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళుతుంద‌న్న అంచ‌నా ఏర్ప‌డింది. చరణ్ ప్రస్తుతం RRR లో తార‌క్ తో క‌లిసి న‌టిస్తున్నారు. చిరంజీవితో క‌లిసి `ఆచార్య` చిత్రం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఇటీవ‌ల‌ రాధే శ్యామ్- సలార్- ఆదిపురుష్- ప్రాజెక్ట్ K (నాగ్ అశ్విన్ చిత్రం) వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

రాధే శ్యామ్ తో పాటు యువీ సంస్థ ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు స‌న్నాహాలు చేస్తోంది. అందుకే చ‌ర‌ణ్‌- ప్ర‌భాస్ మ‌ల్టీస్టార‌ర్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ది. సాహో ఫ్లాప్ త‌ర్వాత ప్ర‌భాస్ తో గ్యాప్ తీసుకున్నా.. యువీ సంస్థ ప్లానింగ్ లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇక‌పైనా వ‌రుస పాన్ ఇండియా చిత్రాలు తీయాల‌న్న క‌సితో ఉంది. ప్ర‌స్తుతం యువి సంస్థ అధినేత‌లు తమ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసిన ఇద్దరు యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రభాస్-చరణ్ ఇద్ద‌రికీ సన్నిహితులైన ద‌ర్శ‌కులు ఆ ఇద్ద‌రూ అని తెలిసింది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం లేక‌పోలేదని ఒక సోర్స్ చెబుతోంది
Tags:    

Similar News