రచయితగా బి.వి.ఎస్.రవి చాలా ఫేమస్. రైటర్ గా అతను ఇప్పటిదాకా 70 సినిమాలకు పని చేయడం విశేషం. ఐతే దర్శకుడిగా మాత్రం అతడికి తొలి సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోపీచంద్ హీరోగా అతను తీసిన ‘వాంటెడ్’ అట్టర్ ఫ్లాప్ అయింది. మళ్లీ దర్శకుడిగా ఇంకో అవకాశం అందుకోవడానికి ఐదారేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు అతడి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘జవాన్’. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తనకు ఎంత కీలకమో చెప్పాడు రవి. ‘‘జవాన్ నా కెరీర్ కు చాలా చాలా ఇంపార్టెంట్. ‘వాంటెడ్’ సినిమా సరిగా చేయలేకపోయాను. అది నాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ‘జవాన్’ సినిమా ఆడితే పది మంది నాకు డబ్బులిచ్చి సినిమాలు తీయమంటారు. లేదంటే నేను పది మంది చుట్టూ సినిమా కోసం తిరగాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా ఆడాలని గట్టిగా కోరుకుంటున్నా. మంచి సినిమా తీశాననే అనుకుంటున్నా. భవిష్యత్తులో విలువలతో కూడిన సినిమాలే తీస్తా’’ అని రవి అన్నాడు.
‘జవాన్’లో హీరో ఆర్ఎస్ఎస్ జవానుగా కనిపిస్తాడని.. ఐతే ఎవరి సెంటిమెంట్లనూ ఈ సినిమాలో గాయపరచలేదని.. మంచి ఉద్దేశాలతో సినిమా తీశానని.. ట్రైలర్లో ఈ సినిమా కథేంటో దాదాపుగా చెప్పేశామని.. కానీ ఇందులో ఒక సీక్రెట్ ఉందని.. అదేంటో తెరమీదే చూడాలని రవి అన్నాడు. ‘జవాన్’ ఏ సినిమాకూ కాపీ కాదని.. ఇదో కొత్త కథ అని అతను చెప్పాడు