ఫ్లాప్‌ డైరక్టర్‌ అన్నందుకు ఫీలయ్యాడట

Update: 2016-02-23 17:30 GMT
బివిఎస్‌ రవి. ఈ పేరు తెలుగు సినిమాలను బాగా ఫాలో అయ్యేవారికి బాగానే తెలుసు. మనోడు రైటర్‌ గా చాలా ఫ్యామస్‌. చాలా సంవత్సరాలు పూరి జగన్‌ క్యాంపులో ఉంటూ... బయట చాలా సినిమాలు రాశాడు. అయితే వరుస ఫ్లాపుల తరువాత పూరి మనోడితో కొలేబరేట్‌ చేయడం మానేశాడు. ఈ మధ్యన పూరితో కలసి మెగాస్టార్‌ చిరంజీవికి 150వ సినిమా కోసం ఒక కథ రాసి.. చక్రం తిరిగిందని అనుకున్నాడు కాని.. అది మొదట్లోనే ఆగిపోయింది.

ఇదంతా ఒకెత్తయితే.. మనోడు ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌ అండ్‌ మెహ్రీన్‌ జంటగా ఒక సినిమాను డైరెక్టు చేసే యోచనలో ఉన్నాడు. ఇక 2011లోనే మనోడు డైరక్టర్‌ గా ''వాంటెడ్‌'' అనే సినిమాను తెరకెక్కించినప్పటికీ.. అది డిజాష్టర్‌ అయ్యింది. అందుకే ఇప్పుడు కొత్త సినిమా అనగానే మనోడి గురించి అందరూ ఫ్లాప్ డైరక్టర్ తో మెగా హీరో సినిమానా?? అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సన్నిహితుల దగ్గర బివిఎస్‌ రవి చాలా బాధపడ్డాడని తెలుస్తోంది. ఒక్క సినిమాకే ఫ్లాప్‌ డైరక్టర్‌ అని కామెంట్లు చేస్తే.. తనని వేస్ట్‌ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారని బాగా హర్టయ్యాడట.

''సాక్షాత్తూ దర్శక దిగ్గజాలైన దాసరి గారు.. రాఘవేంద్రరావులకే ఎన్నో ఫ్లాపులున్నాయి. స్పీల్‌ బర్గ్‌ కు కూడా ఫ్లాపులున్నాయి. ఇక నా తొలి సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన.. ఫ్లాప్‌ డైరక్టర్‌ అనేస్తే ఎలా? నాకు మరో అవకాశం ఇవ్వాలి కదా? ఎన్నో హిట్టు సినిమాలకు కథా మాటలు రాసినోడిని.. అసలు హిట్టు సినిమానే తీయలేనా??'' అంటూ వాపోయాడట. నో డౌట్‌.. అన్ని కరెక్టుగా సెట్టయితే ఎవరైనా హిట్టు సినిమాలు తీయొచ్చు. మరి రవి కూడా రెండో సినిమాతో పిచ్చెకిస్తాడని ఆశిద్దాం.
Tags:    

Similar News