జైసింహ నిర్మాత సి కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు షేర్ చేసుకుంటూ చర్చకు అవకాశం ఇస్తున్నారు. మార్చ్ 1 నుంచి సినిమా పరిశ్రమ స్థంబించడం ఖాయం అన్న కళ్యాణ్ కార్పొరేట్ సంస్థల డిజిటల్ దోపిడీకి అడ్డు కట్ట పడే వరకు పోరాటం ఆపేది లేదు అంటున్నారు. నైజాం లో సినిమాల బిజినెస్ గురించి కూడా కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ సినిమా అమ్మాలన్నా - కొనాలన్నా మొత్తం ముగ్గురి చేతుల్లో ఉండిపోయిందని - వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకునే పరిస్థితి వచ్చిందని అంటున్న కళ్యాణ్ ఇది ఇలాగే కొనసాగితే నిర్మాతలు సినిమాలు తీయడం మానుకుంటారని హెచ్చరించారు. దాని పర్యవసానంగా హీరోలే తమ సినిమాలు తామే నిర్మించుకోవాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు తమ సాధక బాధలు వాళ్ళకు తెలుస్తాయి అన్న కళ్యాణ్ ఆ ముగ్గురు ఎవరో చెప్పలేదు.
సినిమా పరిశ్రమలో పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవని, తనలాంటి సోలో నిర్మాతలకు జిఎస్టి, క్యూబ్, డిజిటల్ వ్యవహారాలు తలనెప్పిగా మారాయని చెప్పారు. వీటికి చరమ గీతం పాడాలి అంటే నిరసన తీవ్రం చేయటం ఒక్కటే మార్గం అన్న కళ్యాణ్ మార్చ్ 1 నుంచి సినిమా థియేటర్ల తో సహా షూటింగ్ లను కూడా ఆపేస్తామని ప్రకటించారు. సినిమా అనేది వ్యాపారమని, దాన్ని శాశించే స్థాయిలో కొందరు వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవడం ప్రమాదమన్న కళ్యాణ్ త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం దక్కకపోతే ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు. సి కళ్యాణ్ అనే కాదు ఆ మద్య సురేష్ బాబు కూడా డిజిటల్ సిస్టం,చార్జీల గురించి తీవ్ర స్వరంతో ఆరోపించిన సంగతి తెలిసిందే. రానున్న రెండు నెలల్లో టాలీవుడ్ లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం మాత్రం ఖాయం.