ఈసారైనా స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కొట్టాలంతే!

Update: 2022-03-06 15:38 GMT
ప్ర‌తిభ ఉంది.. ఛామ్ ఉంది.. అంత‌కుమించి కొల‌వెరిడీ అనిపించే స్టేజ్ అప్పియ‌రెన్స్ కూడా ఉంది అత‌డిలో. కానీ ఏం లాభం? ఆశించిన రేంజుకు ఎద‌గ‌డంలో కొంత త‌డ‌బ‌డ్డాడు. త‌మిళ ఇండ‌స్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగిన అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తెలుగు సినీఇండ‌స్ట్రీలోనూ ఓ వెలుగు వెల‌గాల‌ని త‌పించినా కానీ ప్ర‌తిసారీ వైఫ‌ల్యం ఇబ్బందిక‌రంగా మారింది.

అజ్ఞాత‌వాసికి చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ అందించినా కానీ మూవీ ఫ్లాప‌వ్వ‌డంతో త‌న‌కు ఐడెంటిటీ రాలేదు. అనిరుధ్ పాట‌లు ఎంత బాగా యూత్ కి క‌నెక్ట‌య్యాయో నెగెటివ్ ఫ‌లితంతో అంతే నిరాశ త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాత కూడా అతడి మ్యూజిక్ బావున్నా గ్యాంగ్ లీడ‌ర్ .. జెర్సీ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ హిట్లుగా నిల‌వ‌క‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. కార‌ణం ఏదైనా అనిరుధ్ కి ఇక్క‌డ టైమ్ క‌లిసి రాలేద‌ని చెప్పాలి.

మ‌రోవైపు టాలీవుడ్ లో దేవీశ్రీ - థ‌మ‌న్ హ‌వా మాత్రం అలానే కొన‌సాగుతోంది అంటే అనిరుధ్ లాంటి కాంపిటీట‌ర్ కి హిట్లు రాక‌పోవ‌డం ఒక కార‌ణ‌మ‌ని విశ్లేషించాలి. ఇప్పుడు అనిరుధ్ లాంటి ట్యాలెంట్ మ‌ళ్లీ మ‌ళ్లీ టాలీవుడ్ పై దండెత్తాల‌ని చూడ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇక్క‌డ వ‌రుస ఫ్లాపులు ఎదుర‌య్యాయి కానీ చార్ట్ బ‌స్ట‌ర్లు ఇవ్వ‌డంలో అనిరుధ్ ఫెయిల్ కాలేదు. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ బీస్ట్ కి చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ అందించాడు.

ఇందులో సూఫీ సాంగ్ పెద్ద చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీంతో అతడి క్రేజ్ తెలుగులోనూ క‌నిపిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌- మ‌జిలీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబినేష‌న్ మూవీకి అనిరుధ్ బాణీలు అందిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంటుంది. క‌శ్మీర్ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్రానికి అనిరుధ్ లాంటి ట్యాలెంట్ అయితేనే బావుంటుంద‌న్న అత‌డి ఆలోచ‌న మోనోట‌నీని బ్రేక్ చేస్తోంది. త‌మిళంలో హారిస్ జైరాజ్.. యువ‌న్ శంక‌ర్ రాజా త‌ర్వాత అనిరుధ్ పెప్పీ మ్యూజిక్ .. బీజీఎం స్టైల్ ప్ర‌త్యేకంగా ఉంటుంద‌న‌డంలో సందేహమేం లేదు.
Tags:    

Similar News