తెలుగు సినిమా కథలు మారుతున్నాయ్. ఇటీవల పాన్ ఇండియా ఒరవడిలో అగ్ర హీరోలంతా యూనివర్శల్ టాపిక్ లనే వెతుకుతున్నారు. ఇకపోతే చిన్నా చితకా హీరోలు అయితే క్రియేటివిటీ ప్రయోగాలు అంటూ హద్దు మీరుతున్నారు. ఓటీటీ కంటెంట్ లో పెచ్చు మీరిన విశృంఖలతను పెద్ద తెరపై చూపించలేరు కాబట్టి కొన్ని పరిమితులతో తెలివిగా కథల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి సక్సెసైతే ఓకే ఫెయిలైతేనే ఇబ్బంది.
ఇప్పుడు సైజ్ మ్యాటర్! అంటూ టాలీవుడ్ లో యువీ క్రియేషన్స్ చేస్తున్న ప్రయోగంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమా ఆద్యంతం సైజ్ చుట్టూనే కథంతా తిప్పేస్తున్నారట. అందులోనే ఎమోషన్ రొమాన్స్ లవ్ కామెడీ ఎలివేట్ అవుతాయట. క్రికెట్ బ్యాట్ అదీ ఇదీ అంటూ పోస్టర్లు వేసి .. డజ్ సైజ్ ఈజ్ మ్యాటర్? అంటూ ప్రశ్నించి అసలు విషయం దాచాలనుకున్నా దాగని నిజం బయటపడింది.
అసలు అంగం సైజ్ చిన్నది భార్యను సుఖపెట్టడమెలా? అని భయపడే ఒక అమాయక యువకుడి కథాంశం ఇదని తెలుస్తోంది. ఆ భయం ఉన్నవాడు అనుకోకుండా పెళ్లాడాక ఎలా ఇబ్బంది పడ్డాడు? అసలు ఫస్ట్ నైట్ చేశాడా లేదా? అన్నది తెరపైనే చూడాలట.
మొత్తానికి మనిషిలో ఒక లోపాన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నమిది. సంఘంలో విస్త్రతంగా వికారంగా మాట్లాడుకునే ఇలాంటి థీమ్ లైన్ ని ఎంచుకుని దర్శకుడు కార్తీక్ సాహసమే చేస్తున్నారు. వైకల్యం ఎలిమెంట్ కనెక్టయ్యి కామెడీ పుడితే ఫర్వాలేదు కానీ.. తేడా కొడితేనే ఎబ్బెట్టుగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
అయితే మేర్ల పాక గాంధీ లాంటి ప్రముఖ నవలారచయిత వారసుడిగా మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథ అందించి కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి అంతో ఇంతో నమ్మకం అయితే ఉంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్టు కొట్టిన అతడు ఆ తర్వాత కొంత తడబడినా ఇప్పుడు కంబ్యాక్ కోసం ఈ కొత్త ఎత్తుగడ వేసాడు. మరి అది ఎంతవరకూ సఫలమవుతుంది? అన్నది చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 16 లేదా 23న విడుదల కానుంది.
డజ్ సైజ్ మ్యాటర్? అనే క్యాప్షన్ రాసి వున్న టీ షర్ట్ లు ధరించి నాయకానాయికలు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. సైజ్ మ్యాటర్ తో `ఏక్ మినీ కథ` సినిమా ప్రమోషన్ ని హీట్టెక్కించాలనుకోవడం .. హిట్టు కొట్టాలనుకోవడం సరైనదేనా ప్రేక్షక మహాశయులే నిర్ణయించాల్సి ఉంటుంది.