ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల వ్యవహారం - రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించడంపై పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పెద్ద సినిమాలకు నష్టాలు తెచ్చి పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి అసలు జనాలను థియేటర్లకు రప్పించడమే కష్టంగా ఉంటే.. ఇలాంటి సమయంలో రేట్లు తగ్గిస్తే నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చిరంజీవి - సురేష్ బాబు - నాని - సిద్ధార్థ్ - రాఘవేంద్రరావు వంటి పలువురు సినీ ప్రముఖులు ప్రత్యక్షంగానే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. టికెట్ రేట్ల విషయంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా టికెట్ ధరల్ని కాలానుగుణంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని.. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసమని చిరంజీవి అభిప్రాయ పడ్డారు.
ఇప్పుడున్న రేట్లతో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని.. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని నిర్మాత సురేష్ బాబు అన్నారు. ప్రేక్షకులు - ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ - ప్రొడ్యూసర్స్ అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని.. ప్రస్తుతం టిక్కెట్ ధరలు - షోల నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారని సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పునరాలోచించుకోవాని టాలీవుడ్ పెద్దలు కోరుతుంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం టికెట్ రేట్ల సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మా ఎన్నికల్లో గెలిచిన విష్ణు.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టాలీవుడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలిసి మాట్లాడారు.
ఇదే క్రమంలో 'మా' అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఇండస్ట్రీ సమస్యలపై మంచు విష్ణు చర్చిస్తారని అందరూ అనుకున్నారు. అందులోనూ మంచు ఫ్యామిలీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరి బంధువు కావడంతో.. వీలైనంత త్వరగా మాట్లాడారని భావించారు.
అయితే ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడినట్లు అధికారికంగా వెల్లడికాలేదు. ఇటీవల సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలిపినప్పుడైనా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇవేమీ జరగలేదు.
దీనికి తోడు ఇటీవల మంచు విష్ణు మాట్లాడిన మాటలు పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.
'మా' అధ్యక్షుడిగా కాకుండా వ్యక్తిగతంగా మాత్రమే వచ్చానని చెప్పిన విష్ణు.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పాలసీలతో ఇండస్ట్రీని కాపాడుతున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లం ఎవరిపైనా రాళ్లు విసరకూడదని.. మనం మాట్లాడే విషయాల వలన ఇతరులు మాపై రాళ్లు విసరకూడదన్నారు.
అలాగే ఇచ్చే స్టేట్ మెంట్ ఏదైనా అచితూచి ఇవ్వాలని.. ఇండస్ట్రీ పీపుల్ ఇచ్చే స్టేట్మెంట్స్ చిత్ర పరిశ్రమపై పడుతుందని విష్ణు అన్నారు. అందరూ యూనిటీగా ఉండి, అందరి తరపున స్టేట్మెంట్ ఇవ్వాలని.. లేదంటే వ్యక్తిగతంగా స్టేట్ మెంట్ ఇస్తున్నామని చెప్పుకొవాలని తెలిపారు. విష్ణు ఇక్కడ ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా ఇది టికెట్ రేట్ల మీద ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్ధించిన వారిని ఉద్దేశించి మాట్లాడినవే అని అనుకుంటున్నారు.
'మా' కు సొంత ఖర్చుతో భవనం నిర్మిస్తాననే ప్రధాన హామీతో ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు.. అధ్యక్ష బాధ్యతలు తీసుకుని 50 రోజులు దాటినా ఇంతవరకు అసోసియేషన్ బిల్డింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఎప్పుడు కార్యాచరణ రూపొందిస్తారని సభ్యులు అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్లు - నాలుగు షోలకు మాత్రమే అవకాశం ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా విష్ణు మాట్లాడారని ఓ వర్గం సభ్యుల్లో టాక్ నడుస్తోంది.
బంధుప్రీతితో సినీ ఇండస్ట్రీ కష్టాలపాలయ్యే పరిస్థితి వస్తున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా 'మా' నూతన అధ్యక్షుడు దీనిపై చొరవ తీసుకొని వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.