మురుగదాస్ ఆ స్టార్ హీరోతో తప్ప మరొకరితో సినిమాలు చేయలేరా!

Update: 2020-10-03 11:30 GMT
ఏఆర్ మురుగదాస్..ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్లు సాధించి అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తులుగా రాజమౌళి, శంకర్ పేరు సంపాదించారు.అయితే వీరిద్దరికంటే ముందే మురుగదాస్ ఆ పేరు పొందినా దానిని నిలబెట్టులేకపోయాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. తమిళంలో విజయకాంత్ హీరోగా తీసిన రమణ సినిమా ఆధారంగా ఠాగూర్ ని తీశారు. ఠాగూర్ టైంలో మురుగదాస్ పేరు వెలిగిపోయింది. ఆ తర్వాత మురుగదాస్ సూర్య హీరోగా తీసిన గజనీ మూవీతో సంచలన విజయం అందుకున్నారు.

దాంతో చిరంజీవి మురుగదాస్ ని పిలిపించి స్టాలిన్ సినిమాకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సినిమా చిరంజీవి స్టార్ డం కారణంగా మంచి వసూళ్ళు సాధించింది.. కానీ మురుగదాస్ వైఫల్యం చెందాడని అంతా విమర్శించారు. ఆ తర్వాత మళ్ళీ మురుగదాస్ తెలుగులో దృష్టి పెట్టలేదు. 2008లో హిందీలో అమీర్ ఖాన్ తో గజనీ రీమేక్ తీసి వందకోట్ల సినిమా అంటేనే రికార్డు అనుకునే టైంలో ఏకంగా రూ.230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమా రూపొందించాడు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ తో తుపాకీ మూవీ తీసి విజయం అందుకున్నాడు. దానిని మళ్ళీ హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేశాడు. ఆ తర్వాత తెలుగులో మళ్ళీ చాలా ఏళ్ళకు మహేష్ బాబుతో స్పైడర్ ప్రకటించాడు. దానిపై తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశలు పెట్టుకోగా మళ్ళీ ప్లాప్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ విజయ్ తో మళ్ళీ కత్తి, సర్కార్ వంటి విజయాలు అందుకున్నాడు.

ప్రస్తుతం మురుగదాస్ మళ్లీ విజయ్ తోనే సినిమా చేయనున్నాడు. విజయ్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ మూవీ చేస్తున్నాడు . దీని తర్వాత మళ్ళీ మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ నిర్మాణంలో సినిమా తెర కెక్కనుంది. 2008లోనే అతి పెద్ద విజయాలు సాధించిన మురుగదాస్ రాజమౌళి , శంకర్ లా విభిన్న సినిమాలు తీయకుండా విజయ్ తో కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతున్నాడని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.


Tags:    

Similar News