'నాటు నాటు' పై క్యాప్ జెమినీ స‌వాల్?

Update: 2022-06-13 06:32 GMT
పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' థియేట్రిక‌ల్ ర‌న్ లో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అటుపై అమెరికాలో మ‌ళ్లీ రీరిలీజ్ సైతం జ‌రిగింది. ఇక ఓటీటీలోనూ 'ఆర్ ఆర్ ఆర్' అదే దూకుడు కొన‌సాగించింది. థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసిన అనంత‌రం  ఓటీటీ ద్వారా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్ర‌శంసంలందుకుంది.

ఇదే స‌మ‌యంలో 'ఆర్ ఆర్ ఆర్' మ‌ళ్లీ అమెరికాలో రీరిలీజ్   సైతం జ‌రిగి మ‌రోసారి సంచ‌ల‌నాలు సృష్టించింది. హాలీవుడ్ మేక‌ర్స్...హై ప్రోపైల్ సెల‌బ్రిటీలు సైతం 'ఆర్ ఆర్ ఆర్' ని థియేట‌ర్లో  వీక్షించి త‌మ అభిప్రాయాల్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో ఓపెన్ గా పేర్కొన్నారు. ఇది కేవం ఆర్ ఆర్ ఆర్ కి మాత్ర‌మే ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావించాలి.

'బాహుబ‌లి' త‌ర్వాత 'ఆర్ ఆర్ ఆర్' కి మాత్ర‌మే ఇది సాధ్య‌మైంది. ఇంకా చెప్పాలంటే 'బాహుబ‌లి' కంటే 'ఆర్ ఆర్ ఆర్' నే ఉన్న‌తంగా ఉంద‌ని చెప్పాలి. 'ఆర్ ఆర్ ఆర్' తెలుగు రాష్ర్టాల‌తో పాటు  అమెరికాలో ఒకేసారి  రిలీజ్ అయింది. కానీ ఆ త‌ర్వాత ఇంగ్లీష్   వెర్ష‌న్ ని మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా అమెరికాలో రిలీజ్ చేసి స‌క్సెస్ అవ్వ‌డం అన్న‌ది గొప్ప విష‌యంగా చెప్పాలి.

'ఆర్ ఆర్ ఆర్' విష‌యంలో అదే స‌న్నివేశం రిపీట్ అయింది.  ఇందులో నాటు నాటు పాట ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. అందులో మెగా ప‌వ‌ర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పోటా పోటీగా డాన్స్ తో ప్రేక్ష‌కాభిమానుల్ని ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడీ పాట హిందీ వెర్ష‌న్' నాచో నాచో' ని విదేశీ  సాప్ట్ వేర్ దిగ్గ‌జం క్యాప్ జెమెని చైర్మెన్ పాల్ హెర్మిలిన్ షేర్ చేసి పాట‌లో ఎన్టీఆర్..చ‌ర‌ణ్ డాన్స్ స్టెప్పుల్ని స‌రిపోల్చ‌మ‌ని భార‌తీయ స్నేహితులకు  స‌వాల్ విసిరారు.

పాల్ లింక్డ్ ఇన్ ప్రోపైల్ కి వెళ్లి 'నాటు నాటు' గురించి  త‌న భిప్రాయాల్ని సైతం షేర్ చేసుకున్నారు. ఈ వీడియో కొన్ని వారాల క్రిత‌మే రిలీజ్ అయింది. కానీ  ఇప్పుడిది ఒక ఆచారంగా మారింది. మీరు ఈ పాట‌లో డాన్సు ద‌శ‌ల్ని పోల్చ‌గ‌ల‌రా?  వాటిని అనుస‌రించ‌గ‌ల‌రా? ఈ వారం నా భార‌తీయ స్నేహితులకు స‌రిపోయే వీడియోల్ని షేర్ చేస్తాను.

చూద్దాం ఎంత మంది స్వాగ‌తిస్తారో అని స‌వాల్ విసిరారు. 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ ఈ పోస్ట్ ని ట్విట‌ర్ లో షేర్ చేసింది. అలాగే  పాల్ హెర్మెలిన్ భార‌త‌దేశాన్ని గొప్ప ప‌ర్యాట‌క దేశంగా భావిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ తెలిపింది.
Tags:    

Similar News