విభిన్నమైన సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు తమిళ హీరో ధనుష్. ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీ `ద గ్రే మ్యాన్ `లో నటిస్తున్న ధనుష్ తమిళంలో మరో నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. అందులో ఒకటి బై లింగ్వల్ కూడా. ఇదిలా వుంటే తాజాగా ధనుష్ ఓ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1930 - 40 కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన ఓ కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి `కెప్టెన్ మిల్లర్ ` అనే టైటిల్ ని ఖరారు చేశారు. శనివారం టైటిల్ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. భారీ స్థాయిలో రూపొందుతున్నఈ మూవీని సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీస్ ని రూపొందించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇక సత్యజ్యోతి ఫిలింస్ తమిళ ఇండస్ట్రీలో తమదైన మార్కు సినిమాలని నిర్మించి బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఈ ఇద్దరి కలయికలో ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ని అందించాలన్న లక్ష్యంతో సత్యజ్యోతి ఫిలింస్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చిత్ర బృందం ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం శ్రమించి సెట్స్ పైకి వెళ్లడం విశేషం.
టైటిల్ మోషన్ వీడియోలో ధనుష్ కెప్టెన్ గా ముఖానికి ష్కార్ఫ్, వెనకాల భుజంపై డబుల్ బ్యారెల్ గన్ ధరించి బైక్ పై స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. రాఖీ, సానికాయిధమ్ వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న వరుణ్ మాథేశ్వరన్ సరికొత్త నేపథ్యంలో తెరకెక్కిస్తున్న భారీ మూవీ ఇది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాతలతో ఒకరైన టి.జి. త్యాగరాజన్ మాట్లాడుతూ `మా ప్రతిష్టాత్మకప్రాజెక్ట్ `కెప్టెన్ మిల్లర్`ని ప్రకటించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా ప్రొడక్షన్ లో రూపొందిన సినిమాలలో ఇది ఒకటిగా నిలుస్తుందని గట్టిగా చెప్పగలను. ధనుష్ తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంటుంది.
ఎందుకంటే గతంలో మా కలయికలో వచ్చిన సినిమాలు విజయవంతమయ్యాయి. అరుణ్ మాథేశ్వరన్ నాకు, ధనుష్ కి స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. దీన్ని భారీ స్థాయిలో నిర్మించాలని అనుకున్నాం. దర్శకుడు అరుణ్ అసాధారణ ఆలోచనలు, అసాధారణమైన సినిమాలను అందించడానికి భారీ స్థాయిలో నిర్మించాలని నేను నమ్ముతాను. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమా రేంజ్ ని పెంచుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం ఎఫర్ట్ పెట్టారు. `కెప్టెన్ మిల్లర్` గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంటుంది` అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్, కెమెరా శ్రేయాస్ కృష్ణ, ఎడిటింగ్ నగూరన్.
Full View