మెప్పులు సరే మరి వసూళ్లు

Update: 2018-09-15 10:51 GMT
ఈ మధ్యకాలంలో ఓ సినిమాకు మీడియా నుంచి ప్రేక్షకుల దాకా ఒకేరకమైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా అరుదు. కేరాఫ్ కంచరపాలెం ఈ విషయంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సెలెబ్రిటీలు మొదలుకుని సామాన్యుల దాకా ఇందులో కంటెంట్ కి అందరూ ఫిదా అయినవారే. కానీ ఆశ్చర్యకరంగా వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం చర్చకు దారి తీస్తోంది. విడుదలకు ముందు భారీ ప్రశంశలతో వరసబెట్టి ప్రీమియర్ షోలు వేసి మరీ మీడియా అటెన్షన్ తీసుకున్న రానా టీమ్ దానికి తగ్గ ఫలితాన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చూడలేకపోతోంది. దానికి కారణం చాలా స్పష్టం. టేకింగ్ పరంగా ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేసిన తీరు ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఇది అన్ని వర్గాలకు రీచ్ అయ్యే కాన్సెప్ట్ కాకపోవడంతో కలెక్షన్స్ అందుకోవడంలో కేరాఫ్ కంచరపాలెం పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది.

ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కోటి రూపాయల లోపే కావడంతో నష్టం వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లలో విడుదల చేసారు కానీ వారం వ్యవధిలోనే శైలజారెడ్డి అల్లుడు-యుటర్న్ వచ్చేయడంతో ఇక పుంజుకునే ఛాన్స్ లేకపోయింది. ఏ సెంటర్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ బాగానే ఆదరించినప్పటికీ బిసి సెంటర్స్ లో కేరాఫ్ కంచరపాలెం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. పైగా సురేష్ బాబు రానాలు  తమ పరిచయాలు ఉపయోగించి సినిమాను ప్రమోట్ చేయటం వల్ల అందరు క్లాసిక్ అని పొగిడారు నిజానికి ఇదొక్క మంచి సినిమా మాత్రమే అనే కామెంట్ ని ఖండించలేం. గతంలో సురేష్ సంస్థ ఇదే తరహాలో ప్రమోట్ చేసిన పెళ్లి చూపులు పది కోట్లకు పైగా  రాబట్టి బెస్ట్ వెంచర్ గా నిలిచింది. కానీ కేరాఫ్ కంచరపాలెం ఆ స్థాయి విజయం అందుకోలేదనే చెప్పాలి. ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు ఎంత షేర్ వచ్చింది అనే దాన్ని బట్టి దీనికి పడే ముద్ర ఆధారపడి ఉంటుంది.
Tags:    

Similar News