పెళ్ళంటూ మోసగించాడు..నటి ఫిర్యాదుతో ద‌ర్శిన్ పై కేసు..

Update: 2020-10-06 10:30 GMT
ద్వి భాషా చిత్రాల్లో నటించి పేరు తెచుకున్న ఓ హీరోయిన్ ఓ యువ  నటుడిని ప్రేమించింది. అతడు కూడా ఆమెను ఇష్టపడటంతో ఇద్దరూ చెట్టా పట్టా లేసుకుని తిరిగారు. సదరు వ్యక్తి ఇటీవల తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక  ఆ హీరోయిన్ తలచింది. అంతలో హీరోయిన్ పెళ్లి మాట ఎత్తగానే అతడు ఆమెకు దూరమై షాక్ ఇచ్చాడు.  ఆమె  దీనిపై కోర్టు మెట్లక్కడంతో చివరికి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. స‌నంశెట్టి తెలుగు, త‌మిళ భాషలలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా  న‌టించారు. ఆమె న‌టుడు ద‌ర్శిన్ ను ప్రేమించింది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు.  కొంత‌కాలంగా వీరి ప్రేమాయణం సాగుతోంది.

కొన్ని సినిమాల్లో నటించిన ద‌ర్శిన్ త‌మిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొని తమిళనాడు ప్రేక్షకులకు మ‌రింత దగ్గర అయ్యాడు. ఇటీవల  స‌నంశెట్టి ద‌ర్శిన్ వద్ద పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చింది. అంతే మనోడు అసలు విషయాన్నీ కుండ బద్దలు గొట్టాడు. పెళ్లంటే ససేమిరా కుదరదన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన  స‌నంశెట్టి తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆడియారు మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి  ఏడాది పాటు తన వెంట తిప్పుకున్నాడని వివరించింది. పోలీసులు ద‌ర్శిన్‌ ను పోలీసు స్టేషన్ లో విచారించినా అతడి పై ఎటువంటి చర్యలు చేపట్టలేదు.  అతడిని వదిలి పెట్టారు. దీంతో   స‌నం శెట్టి తనకు న్యాయం చేయాలని  కోర్టు మెట్లెక్కింది.  దర్శిన్‌ పై చర్యల కు కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో  పోలీసులు అతడిపై పై కేసు నమోదు చేశారు. త్వరలోనే అరెస్టు చేయనున్నారు.
Tags:    

Similar News