సెలబ్రేషన్ లో ఉన్న మెగాస్టార్‌ పై కేసు నమోదు

Update: 2021-08-10 10:30 GMT
మలయాళ మెగా స్టార్‌ మమ్ముట్టీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆగస్టు 9కి 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా కేవలం మలయాళ సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు మాత్రమే కాకుండా దేశ వ్యప్తంగా అనేక మంది ప్రముఖులు కూడా మమ్ముట్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ లో మమ్ముట్టీకి శుభాకాంక్షలు చెప్పడం.. ఆ తర్వాత మెగా స్టార్‌ మమ్ముట్టీ కూడా రిప్లై ఇవ్వడం వంటివి అభిమానులు చూశారు. ఒక వైపు మమ్ముట్టీ సెలబ్రేషన్ లో మునిగి పోయి ఉండగా అనూహ్యంగా ఆయనపై కేసు నమోదు అవ్వడం అభిమానులకు ఆవేదన కలిగించింది. అభిమానులు మమ్ముట్టీ పై కేసు పెట్టడంపై కేరళ పోలీసులపై సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించని కారణంగా మొత్తం 300 మంది పై కేసు నమోదు చేస్తే అందులో మమ్ముట్టీ పేరు కూడా ఉంది.

అసలు విషయంలోకి వెళ్తే.. వారం రోజుల క్రితం ఓజికోడ్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డ్‌ ను ప్రారంభించేందుకు గాను నటుడు రమేష్‌ పిశారోడి తో కలిసి హాజరు అయ్యారు. ఆ సమయంలో ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఏకంగా 300 మంది పాల్గొనేలా చేశారు. కేరళ పోలీసులు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తారు. మమ్ముట్టీ మరియు ఆసుపత్రి వర్గాలపై కూడా తాజాగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ 300 మందికి జరిమానాతో పాటు శిక్ష కూడా తప్పదేమో అంటూ నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్‌ 19 నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మెగాస్టార్‌ మమ్ముట్టీ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాల వారు చేసిన తప్పుకు మమ్ముట్టీ గారిని శిక్షించడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఆసుపత్రి వర్గాల వారు తప్పు తమదిగా ఒప్పుకోవాలని.. మమ్ముట్టీ పై కేసును రద్దు చేయాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానం ముగించుకున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా మమ్ముట్టీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన నుండి మళ్లీ మళ్లీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి ఇండియన్ స్ర్కీన్‌ పై బిగ్గెస్ట్‌ సక్సెస్ లను దక్కించుకుంటాయని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News