అయిన దానికి కాని దానికి మనోభావాలు దెబ్బ తినేసే కాలమిది. ట్రెండ్ అలా ఉంది. బాలీవుడ్ లో పద్మావతి సినిమా వివాదం మొదలు.. ఆ తరహాలో ఏదైనా హిస్టారికల్ సినిమా తీసినా బయోపిక్ తీసినా చంపేస్తాం నరికేస్తాం.. సెట్లు తగలబెడతాం! అంటూ సినిమావాళ్లను పరుగులెట్టిస్తున్నారు.
తాజాగా ధనుష్ చేస్తున్న కర్ణన్ చిత్రానికి ఇలాంటి తిప్పలే మీద పడ్డాయి.అసురన్- పట్టాస్ చిత్రాలతో హిట్లు కొట్టి దూకుడుమీదున్న అతడు కర్ణన్ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాడట. ఈ సినిమాని జగమే తంత్రం పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. మారి సెల్వరాజ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
అయితే కర్ణన్ టైటిల్ విషయమై శివాజీ గణేశన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేసి నానా గడబిడ చేస్తున్నారు. తమ హీరో టైటిల్ ను ధనుష్ కాపీ కొడతాడా అదెలా కుదురుతుంది అనేది వారి వాదన. క్లాసిక్ డేస్ లో కర్ణన్ చిత్రంలో శివాజీ గణేశన్ నటన ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు అదే కథను కాస్త అటూ ఇటూగా ధనుష్ కోసం మార్చారట. 1999లో జరిగిన కొడియాంగుళం.. మణిమచ్చి జాతుల మధ్య వైరం ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. అందులో పులిప్పడై సామాజిక వర్గాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ధనుష్ పై రుసరుసలాడేస్తున్నారు. ఇందులో ఓ సీన్ లో ధనుష్ పోలీస్ స్టేషన్ ను కాల్చేస్తాడట. అది తమను టార్గెట్ చేసినదేనంటూ ఆ సామాజిక వర్గం ఫైరవుతోంది. సినిమాల్ని కులాల కుంపటిలోకి లాగడం అన్నది ఇబ్బందికరమే అయినా ధనుష్ ఇప్పుడు దానిని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు? అన్నది ఆసక్తికరంగా మారింది.