కేథరిన్ థెరెసా.. టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు కోలీవుడ్ లో సత్తా చాటుతోంది. తమిళంలో తన తొలి చిత్రం మద్రాస్ లో డీ గ్లామర్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన రుద్రమదేవిలో.. కేథరినే చేసినది చిన్న పాత్రే అయినా, అందంతో కట్టిపడేసింది.
ఈ మూవీ తర్వాత కేథరిన్ కు తమిళంలో ఒకేసారి 4 ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేసేసింది. తెలుగులోనూ అల్లు అర్జున్ సరసన నటిస్తూ ఫుల్లు బిజీగా ఉంది. ప్రతీ ఏటా క్రిస్ మస్ - న్యూ ఇయర్ లో అబ్రాడ్ లో చేసుకోవడం ఈమెకు అలవాడు. ఈ సారి పేరెంట్స్ తో కలిసి బీజింగ్ వెళుతున్నట్లు చెప్పింది కేథరిన్. "పండగ అంటే ప్రజలకు అవసరమైనది ఏదైనా చేయడం, అలాగే జంతువులకు కూడా. ఇది ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాల్సిన సమయం" అంటూ ఫెస్టివల్ కు తనదైన అర్ధం చెప్పింది కేథరిన్.
చిన్నపుడు పండగ అంటే చాకొలేట్స్ - ప్లమ్ కేక్స్ అనుకునేదాన్నని.. శాంటాక్లాజ్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడని వెయిట్ చేసేదాన్నని చెబుతూ నవ్వుతోంది ఈ సుందరి. అయితే.. తినడంలో మాత్రం ఈమెకు బోలెడు ఎక్స్ పీరియన్స్ ఉందట. వండడం అంటే మాత్రం.. తనకు వంటిల్లు ఎక్కడుందో కూడా తెలీదని తప్పించేసుకుంటానంటోంది. అయితే.. ఆచార వ్యవహరాలను బాగా నమ్ముతుందట ఈ పాతికేళ్ల సుందరి. వాళ్ల సాంప్రదాయం ప్రకారం మిజిల్ టోయ్ చెట్టు కింద నిలబడి ఉన్నపుడు, నచ్చినవాడు వచ్చి ముద్దు పెట్టుకోవచ్చు. దీన్ని తాను ప్రయత్నిస్తానని, అందుకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పింది కేథరిన్. అందం వెనుక ఆచారం.. బాగుంది కదూ.