చిరుతో చిందెయ్యలేదు!! వారినే అడగండి

Update: 2017-08-07 12:00 GMT
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఎవరికైనా ఛాన్స్ వస్తే వదులుకుంటారా? అలాంటిది ఆయనతో ఒక పాటలో చిందేయడానికి ఛాన్స్ వచ్చిందంటే ఏ మాత్రం ఆలోచంచారనే చెప్పాలి. కానీ  ఓ హీరయిన్ మాత్రం అందుకు విరుద్ధంగా చిరు సినిమా నుంచి తప్పుకుందట. ఆమె ఎవరో కాదు క్యాథెరిన్.  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 లోని ఐటెమ్ సాంగ్ కి వినాయక్ సెలక్ట్ చేసిన భామ కోపంతో వెళ్లిపోయిందని అప్పట్లో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.

చిరు 150వ సినిమాకు ఆయన పెద్ద కూతురు సుస్మితా కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన సంగతి తెలిసందే.. అయితే మొదట ఆ సినిమాలో "రత్తాలు రత్తాలు" పాటకు క్యాథెరిన్ నే సెలెక్ట్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని క్యాథెరిన్ కోపంతో సెట్ లో నుండి వెళ్లిపోయిందట. అప్పట్లో ఈ విషయాన్ని బయటకి రానివ్వకుండా కవర్ చేసి, సైలెంట్ గా లక్ష్మి రాయ్ ని పిలిపించి.. సాంగ్ ని పూర్తీ చేశారట. ఆయితే రీసెంట్ గా ఈ విషయంపై క్యాథరిన్ ఎవరు ఊహించని విధంగా స్పందించింది.

చిరు 150 సినిమాలో స్పెషల్ సాంగ్ నుంచి ఎందుకు బయటకు వచ్చేశారని ఓ మీడియా విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె.."ఆ విషయంపై నేను చెప్పేది ఏమీ లేదు.. వారు మాత్రమే ఈ విషయం గురించి స్పందించాలి" అంటూ కౌంటర్ వేసింది. దీంతో క్యాథెరిన్ చెప్పిన సమాధానం అనేక అనుమానాలకు దారి తీస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాస్ట్యూమ్ విషయంలోనే క్యాథరిన్ - సుస్మిత మధ్యలో వాగ్వివాదం చెలరేగిన సంగతి ఎల ఉన్నా.. ఇప్పుడు బంతిని మెగా కోర్టులోనే వేయడం ఓ రేంజులో ఉందిలే. మరి 150 నిర్మాత రామ్ చరణ్‌ స్పందిస్తాడా?
Tags:    

Similar News