మరో రియల్ స్టోరీ లో రేర్ కాంబినేషన్!
ఈ నేపథ్యంలో ధనుష్ ప్రాజెక్ట్ కూడా రియల్ స్టోరీ ఆధారంగానే తెరెక్కుతుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా అమరన్ డైరెక్టర్ రాజ్ కమార్ పెరియాస్వామి కొత్త ప్రాజెక్ట్ ని ఇటీవల పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. 'అమరన్' విజయంతో రాజ్ కుమార్ ఒక్కసారిగా కోలీవుడ్...టాలీవుడ్..బాలీవుడ్ లో ఫేమస్ అయ్యా డు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఓ హీరోతో సినిమా ప్రకటించాడు. అయితే అంతకంటే ముందే ధనుష్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించి ముందుకు తీసుకెళ్తున్నాడు. దీంతో ఈ సినిమా స్టోరీ ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం ఇది వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రమని తెలిసింది. సమాజంలో ఎందరో రియల్ లైఫ్ హీరోలున్నారు. వాళ్ల కథన సినిమాగా మలిస్తే అద్బుతాలకు అవకాశం ఉందని ఓ సందర్భంలో రాజ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ధనుష్ ప్రాజెక్ట్ కూడా రియల్ స్టోరీ ఆధారంగానే తెరెక్కుతుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆస్టోరీ ఏంటి? అన్నది రివీల్ కాలేదు గానీ దేశాన్ని కుదిపేసిన మరో ఘటన ఇదని అంటున్నారు.
అలాగే ఇందులో ధనుష్ కి జోడీగా ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. తాజగా ఆ వివరాలు కూడా లీకయ్యాయి. ఇందులో శ్రుతి హాసన్ ఎంపికైందని చిత్ర వర్గాల సమాచారం. ఓ డిఫరెంట్ పాత్రలో శ్రుతి హాసన్ నటిస్తుందిట. ఇప్పటి వరకూ శ్రుతి పోషించిన రోల్ ఇదని అంటున్నారు. రామస్వామి పాత్ర గురించి చెప్పకుండా మరో మాట లేకుండా ఎస్ చెప్పిందిట. అంతగా ఆ పాత్రకు శ్రుతి హాసన్ కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది.
ధనుష్ తో కలిసి నటించడం ఇది రెండవ సారి. కెరీర్ ఆరంభంలో ఇద్దరు జంటగా '3' అనే సినిమా చేసారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి పనిచేయలేదు. మళ్లీ ఇంత కాలానికి ఆ కలయికలో మరో సినిమాకు రంగం సిద్దమవుతుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ 'కూలీ' షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తికాగానే ధనుష్ సినిమా షూట్ లో పాల్గొంటుందని సమాచారం.