పద్మావత్-అవన్నీ నమ్మకండి

Update: 2018-01-10 11:36 GMT
తీవ్ర వివాదాల మధ్య నలిగి - విడుదల చేస్తే కనక థియేటర్లను తగలబెడతాం అని వార్నింగ్ ఇచ్చే దాకా ఏదైనా సినిమా వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో పద్మావత్ ఒక్కటే. డిసెంబర్ 1నే విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీని ఆక్షేపణలు, వివాదాల మద్య సెన్సార్ జాప్యం జరిగి చివరికి క్లియరెన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాని 25 కట్స్ ఇచ్చారని కొన్ని సార్లు, లేదు వందకు పైగా కట్స్ ఉన్నాయని మరికొన్ని సార్లు రకరకాల మీడియా సాధనాల్లో వార్తలు ప్రసారం కావడంతో అభిమానుల్లో కాస్తంత అయోమయం నెలకొంది. ఇన్నేసి కట్స్ ఇస్తే ఇక సినిమా ఏం చూస్తాం అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. వాటికీ చెక్ పెట్టేసారు సెన్సార్ బోర్డు చైర్మెన్ ప్రసూన్ జోషి.

ప్రచారంలో ఉన్నట్టు తాము అన్ని కట్స్ చెప్పలేదని - కేవలం 5 చోట్ల మాత్రమే కొన్ని మార్పులు కట్స్ సూచించామని, వాటిని సరి చేసి తీసుకొచ్చిన కాపీకి యు/ఎ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసామని స్పష్టం చేసారు. ఇది విన్న సినిమా ప్రేమికులు హమ్మయ్య అనుకుంటున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద అతి అరుదైన దృశ్యకావ్యంగా దీని మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. జనవరి  25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ తో పోటీ పడుతుండగా రిపబ్లిక్ డే రోజు షెడ్యూల్ చేసిన ఆయారీ మాత్రం ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేసారు.

ఇంతా చేసి పద్మావత్ కు అంత క్లియర్ అయినట్టు కాదు. సెన్సార్ ఒప్పుకున్నా తాము మాత్రం వెనక్కు తగ్గేది లేదని కర్ణి సేన హెచ్చరికలు జరీ చేస్తూనే ఉంది. విడుదల రోజు మహారాష్ట్ర - రాజస్తాన్ - గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తత ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మేరకు పోలీస్ సెక్యూరిటీ మధ్య సినిమా ప్రదర్శించేందుకు హళ్ళ యజమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీపికా పదుకునే - రన్వీర్ సింగ్ - షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రీజనల్ గా ఆయా బాషలలో తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. తెలుగులో కూడా ఐదు సినిమాల దాకా ప్లాన్ చేసారు.
Tags:    

Similar News