ప్రస్తుతం సినిమాల ప్రభావం జనాల్లో బాగానే చూపెడుతోందని సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ మాత్రం ఆలోచించకుండా సీన్స్ కి కత్తెర పడాల్సిందే అంటున్నారు. సినిమాకి ఆ సన్నివేశం అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సినిమా ఎవ్వరిదైనా సరే ఎలాంటిదైనా సరే తీసేయ్యమని చెబుతున్నారు. సాధారణంగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించేటప్పుడు దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అవసరం అనుకున్న సీన్స్ ని మాత్రమే తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు. కానీ సెన్సార్ సభ్యులు కట్ చెప్పి వారికి షాక్ ఇస్తారు.అయితే రీసెంట్ గా ఇదే తరహాలో ఓ సినిమాకు ఊహించని విధంగా కట్స్ పడ్డాయి. 'లవ్ సోనియా' అనే బాలీవుడ్ సినిమాకి సీ.బీ.ఎఫ్.సీ ఎప్పుడు లేని విధంగా 45 సీన్లకు కత్తెర పని చెప్పిందట. ఇక అన్ని సీన్స్ తీసేయ్యామని చెప్పినా కూడా కేంద్ర సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇవ్వడం మరో షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అమ్మాయిలని అక్రమంగా విదేశాలకు తరలించే తరహా కథను దర్శకుడు తాబ్రేజ్ నూరానీ తెరకెక్కించాడు.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కపోయినా చిత్రంలో మాత్రం కొందరు ప్రముఖ నటీనటులు ఉన్నారు. రిచా చద్దా మరియు డెమీ మూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది 46 సీన్లకు కట్ చెప్పారంటే అసలు సినిమాలో అసలైన సీన్స్ ఉండవనే టాక్ వినిపిస్తోంది. అలాగే చిత్ర యూనిట్ కూడా మెయిన్స్ సీన్స్ కొన్ని సెన్సార్ సభ్యులు అనవసరంగా కట్ చేశారని చెప్పారని తెలుస్తోంది. మారి ఈ సినిమా విడుదల తర్వాత ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.