కామెంట్: సెలబ్రిటీ బ్రేకప్ లపై పైత్యం

Update: 2016-10-04 01:30 GMT
సెలబ్రిటీ స్టేటస్ అనుభవించేటప్పుడు బాగానే ఉంటుంది కానీ.. ఏదన్నా సిట్యుయేషన్ తేడా వచ్చినపుడే అందులో ఉండే ఇబ్బందేంటో అర్ధమవుతుంది. ముఖ్యంగా రిలేషన్స్ విషయంలో దీని ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. పెళ్లి చేసుకున్నవాళ్లు విడాకులు తీసుకోవాల్సి వస్తేనో.. ప్రేమ జంట బ్రేకప్ చెప్పుకుంటేనో.. ఎవరికి వాళ్లు ఊహించేసుకుని బురద జల్లేసే కథలు బోలెడుంటాయి. ఇక సోషల్ మీడియాలో ఒకరిని చూసి మరొకరు తీసే అర్ధాలకయితే లెక్కే లేదు.

పైగా ఈ మధ్య ట్రాలింగ్ బాగా ఎక్కువయిపోయింది. హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్- ఏంజెలీనా జూలీలు రెండేళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్లు బైటపడగానే.. రకరకాల కారణాలను ఊహించేసి ఇబ్బంది పెట్టేశారు. రీసెంట్ గా రజినీకాంత్ కూతురు సౌందర్య-అశ్విన్ రామ్ కుమార్ లు కూడా విడిపోయే సిట్యుయేషన్ వచ్చింది. తండ్రి రజినీ పేరు చుట్టూ తిరుగుతున్న ఈ రూమర్స్ అన్నిటినీ చెక్ పెట్టేందుకు.. తనే విడాకులపై స్పందించింది సౌందర్య. శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్- ప్రియల డైవోర్స్ వ్యవహారం కూడా చాలామంది నోళ్లలోనే నానింది.

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని కామెంట్ చేసేస్తూ.. నెట్ లో జరుగుతున్న హంగామా ఎక్కువైపోతోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పై.. ఓ పరిధిని మించితే.. అభిమానం దురభిమానంగా మారిపోయే ప్రమాదం ఉంది. టెక్నాలజీ మనకు సౌకర్యాన్ని.. ఇతరుల జీవితాలను ప్రభావం చూపేలా ఉపయోగిస్తుండడం మాత్రం బాధాకరమే. దీనికి పరిష్కారం ఏంటో తెలియక మనసులో బాధ బైట పెట్టలేకపోతున్ సెలబ్రిటీలు ఎందరో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News