పవన్ బర్త్ డే స్పెషల్ ట్విట్టర్ స్పేస్ లో పాల్గొనే సెలబ్రిటీలు..!

Update: 2021-09-01 11:30 GMT
ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పెషల్ స్పేస్ సెషన్ నిర్వహించడం అనేది కామన్ గా మారింది. దీని ద్వారా పలువురు సెలబ్రిటీలు ఒకచోట చేరి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే హీరో లేదా హీరోయిన్ తో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంటే.. సినీ అభిమానులు వాటిని వింటూ ఉంటారు. ఈ మధ్య మహేష్ బాబు - చిరంజీవి - నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని స్పేస్ సెషన్ ఏర్పాటు చేయగా నెటిజన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా ట్విట్టర్ స్పేస్ సెషన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే రేపు శుక్రవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల ముందుగానే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. జనసేనాని బర్త్ డే కోసం ఫ్యాన్స్ - జన సైనికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ట్విట్టర్ స్పేస్ నిర్వహించనున్నారు. ఈ సెషన్ లో బాబీ (కేఎస్ రవీంద్ర) - క్రిష్ జాగర్లమూడి - నిధి అగర్వాల్ - అనన్య నాగళ్ళ - సంజనా గల్రాని - నీలిమ - బ్రహ్మాజీ - వరుణ్ సందేశ్ - కిరణ్ అబ్బవరం - బండ్ల గణేష్ - అనూప్ రూబెన్స్ - భాస్కర భట్ల తదితరులు పాల్గొననున్నారు. వీరితోపాటు మరికొంతమంది సెలబ్రిటీలు ట్విట్టర్ స్పేస్ కు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉంటే పవన్ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించిన స్పెషల్ అప్‌డేట్స్ రాబోతున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. అలానే క్రిష్ తో కలిసి చేస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం నుంచి స్పెషల్ బర్త్ డే పోస్టర్ రానుంది. పవర్ - హరీష్ శంకర్ కాంబోలో రూపొందే #PSPK28 ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారని సమాచారం. అలానే సురేందర్ రెడ్డి తో చేయాల్సిన సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్.. మరో రెండు కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా రేపు రాబోయే పవర్ ఫుల్ అప్డేట్స్ బర్త్ డేని మరింత ప్రత్యేకంగా మారుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Tags:    

Similar News