మాస్క్‌ లతో రోడ్ల మీదకు వస్తున్న సెలబ్రెటీలు

Update: 2020-06-08 16:00 GMT
గత రెండు నెలలుగా జిమ్‌ సెంటర్‌ లు మూత పడి ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తి జిమ్‌ సెంటర్‌ ల నుండి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని వాటిని ఇప్పటి వరకు కూడా ఓపెన్‌ చేసేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ సమయంలో సెలబ్రెటీలు జిమ్‌ లు లేకపోవడంతో ఇంట్లో కసరత్తులు చేస్తున్నారు. కొందరు మాత్రం బయట వాకింగ్‌ చేసేందుకు సమయం కేటాయిస్తున్నారు. సాదారణంగా అయితే షూటింగ్స్‌ తో బిజీ బిజీగా ఉండి వాకింగ్‌ కు సమయం లభించదు. కాని ఇప్పుడు ఎక్కువ మంది వాకింగ్స్‌ చేస్తున్నారు.

టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. బాలీవుడ్‌ హీరోలు హీరోయిన్స్‌ ఇతర స్టార్స్‌ అంతా కూడా వాకింగ్‌ కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్‌ హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్‌ లో వాకింగ్‌ చేస్తూ కనిపించాడు. ఇక హీరోయిన్స్‌ పలువురు రోడ్ల మీదకు మాస్క్‌ లతో వస్తున్నారు. ఎంత మాస్క్‌ లు పెట్టుకున్నా ప్రతి హీరోయిన్‌ ను జనాలు గుర్తు పడుతూనే ఉన్నారు. అలా ఎంతో మంది ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

స్నేహితులతో లేదంటే కుటుంబ సభ్యులతో స్టార్స్‌ వాకింగ్‌ చేస్తున్నారు. ఈమద్య కాలంలో వాకింగ్‌ చేసిన వారిలో అల్లు అర్జున్‌ తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. కరీనా కపూర్‌.. జార్జియా ఆండ్రియా.. రేఖ చక్రవర్తి ఇంకా కొందరు సెలబ్రెటీలు మాస్క్‌ లతో వాకింగ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. షూటింగ్స్‌ ప్రారంభం అయితే మళ్లీ వీరికి సమయం లభించక పోవచ్చు. అందుకే ఇప్పుడే వాకింగ్‌ చేస్తూ ఫిట్‌ నెస్‌ పొందుతున్నారు.
Tags:    

Similar News