కుర్రాళ్లకు మన స్టార్స్ ఫిదా!!

Update: 2018-02-03 11:13 GMT
మొన్నటి వరకు అండర్ - 19 జట్టు ఆడే మ్యాచులను ఎవరు అంతగా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ న్యూజిలాండ్ లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో యువ ఆటగాళ్లు మంచి ఆటతో దేశానికి మంచి గుర్తింపు తెస్తుండడంతో అందరు ఒక్కసారిగా ఆకర్షితులయ్యారు. గ్రేట్ వాల్ ద్రావిడ్ కోచ్ గా కుర్రాళ్లకు అద్భుతమైన శిక్షణను ఇచ్చి వాళ్ల జీవితంలో చిరకాలం గుర్తుండి పోయేలా వరల్డ్ కప్ ని అందించారు. దీంతో రాహుల్ కు అలాగే కుర్రాళ్లకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఇక మన తెలుగు సెలబ్రెటీలు కూడా జట్టు సబ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు వారి గురించి పోస్ట్ చేయడం నిజంగా షాకింగ్ న్యూస్. ఇతర విషయాల గురించి ఎక్కువగా పోస్ట్ చేయని మహేష్ మొదటి సారి క్రికెట్ గురించి ట్వీట్ చేశాడు.  అండర్ 19 జట్టు గెలిచినందుకు చాలా గర్వంగా ఉందని శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక దర్శకదీరుడు రాజమౌళి కూడా తనదైన శైలిలో విషెస్ అందించాడు. నాలుగవ సారి అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచిందనుకు జట్టుకు శుభాకాంక్షలు.  సీనియర్ టీమ్ అలాగే అండర్ 19 టీమ్ జట్టు బౌలింగ్ ఎటాక్ లో చాలా బెస్ట్ అని ట్వీట్ చేశాడు. ఇక క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడే విక్టరీ వెంకటేష్ కూడా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. టోర్నమెంట్ మొత్తంలో అద్భుతంగా రాణించారంటూ పేర్కొన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన స్టైల్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా టీమ్ సబ్యులకు కోచ్ ద్రావిడ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.   

Tags:    

Similar News