ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ.. లెజెండరీ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, నటుడు జగపతిబాబు అన్న కూతురు పూజా ప్రసాద్ ని పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమిది. ఈనెల 30(ఆదివారం)న జైపూర్ లోని ఫెయిర్ మౌంట్ భవంతి లో ఈ జంట వివాహం జరగనుంది. మూడు రోజుల ముందే ఈ వేడుకలకు సంబంధించిన ఉత్సవం మొదలైంది. గురువారం (28న) సాయంత్రం నుంచే బరాత్ వేడుక సహా సంగీత్ కార్యక్రమానికి సంబంధించి హడావుడి మొదలైంది. నేడు సంగీత్ కార్యక్రమం ఘనంగా జరుగుతోందని సమాచారం.
ఈ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి సెలక్టెడ్ గా అతిధులు హాజరయ్యారు. కింగ్ నాగార్జున - అఖిల్ - రామ్ చరణ్ - ప్రభాస్ - తారక్ - రానా - అనుష్క తదితరులు ఎటెండ్ అయ్యారు. అయితే టాలీవుడ్ నుంచి టాప్ హీరోలెందరో ఈ వేడుకల్లో మిస్సయ్యారు. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్లు ఇప్పటివరకూ ఈ వేడుకల్లో కనిపించలేదు.
అయితే మెగాస్టార్ చిరంజీవికి - గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి ఆహ్వానాలు అందాయిట. వీళ్లు పెళ్లి రోజు అటెండయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మహేష్ - బన్నిలకు ఆహ్వానాలు అందలేదన్న ప్రచారం సాగుతోంది. మహేష్ ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్నాడు. దుబాయ్ నుంచి వెనక్కి రావాల్సి ఉన్నా - ఆలోచన మార్చుకుని అక్కడే ఉన్నారట. జైపూర్ అతిధుల జాబితాలో కేవలం కొన్ని పేర్లు మాత్రమే ఉన్నాయి. తనకు అత్యంత సన్నిహితుల్ని మాత్రమే సెలక్టివ్ గా రాజమౌళి ఆహ్వానించారట. వాళ్లు మాత్రమే ఈ వేడుకకు వెళుతున్నారని, అటుపై హైదరాబాద్ రిసెప్షన్ కి ఇతర ప్రముఖులందరినీ ఆహ్వానించారని తెలుస్తోంది. రిసెప్షన్ గ్రాండ్ గా ఉంటుందని చెబుతున్నారు. అంటే పెండింగ్ స్టార్లు అంతా నవ వధూవరుల్ని హైదరాబాద్ రిసెప్షన్ లోనే ఆశీర్వదిస్తారని భావిస్తున్నారు.