అవార్డులు తీస్కోండి.. షో చేయద్దు

Update: 2018-04-23 07:23 GMT
ఇప్పుడు అవార్డ్ ఈవెంట్లు బాగా పెరిగిపోయాయి. గతంలో మాదిరిగా ఏటా ఒకట్రెండు కాదు.. ఇప్పుడు నెలకో 2-3 ఈవెంట్లు కనిపించేస్తున్నాయి. అయితే.. వీటిలో చాలావరకు కమర్షియల్ యాంగిల్ తోనే జరుగుతున్నా.. ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కావడంతో వీటికి ఆదరణ బాగానే ఉంటోంది.

 అయితే.. ఇలా ఆర్భాటంగా జరుగుతున్న అవార్డు కార్యక్రమాలలో.. అందాల తారల క్లీవేజ్ షో రచ్చ చేయడం కామన్ అయిపోయింది. ఎంత ఎక్కువగా సోకులను చూపితే.. వారినే హైలైట్ చేస్తోంది మీడియా. దీంతో అవార్డు షో అనగానే క్లీవేజ్ గట్రా చూపించేసి అమ్మళ్ళు రచ్చ చేస్తున్నారు. దీంతో అసలు అవార్డు షో నిర్వహించిన పర్పస్ నెరవేరడం లేదు. దీంతో రీసెంట్ గా దాదాసాహెబ్ ఫాల్కే స్మృతిగా అవార్డు షో కార్యక్రమాన్ని నిర్వాహకులు.. విచిత్రమైన రూల్ పెట్టారు. అదేంటంటే ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యే అందరూ కచ్చితంగా.. ఎత్నిక్ వేర్ లో రావాలంటూ రూల్ పెట్టారట.

 దీంతో ఈ ఈవెంట్ కు చాలామంది హీరోలు.. హీరోయిన్లతో పాటు అప్ కమింగ్ సుందరాంగులు కూడా తప్పనిసరిగా చీరకట్టుతో పాటు పలు సాంప్రదాయ దుస్తులతోనే అటెండ్ కావాల్సి వచ్చింది. అఫ్ కోర్స్.. చీరలో కూడా వయ్యారాలను ఎలా ప్రదర్శించాలో.. పలువురు సీనియర్లు చూపించేశారు లెండి. ఇది యంగ్ జనరేషన్ బ్యూటీస్ కు మంచి గ్లామర్ లెసన్స్ నేర్పించిన ఈవెంట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News