ఆకాశమంత పందిరి వేయాల్సిన పనే లేకుండా అంబానీ డాటర్ ఇషా పెళ్లి 27 అంతస్తుల ఇంద్రభవనం అంటిల్లిలో అత్యంత వైభవంగా జరిగింది. గత నెలరోజులుగా ఆ ఇంట జాతర కొనసాగుతోంది. ఈ జాతరకు ఎవరెవరు వస్తున్నారో - ఎవరెవరు వెళుతున్నారో కూడా తెలీని పరిస్థితి. ఒకే ఒక్క పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 700కోట్లు ఖర్చు చేయడంపై సెలబ్రిటీలే ఔరౌరా! అంటూ ముక్కన వేలేసుకుంటున్నారు. మధ్యతరగతి - బడుగులు - సామాన్యులైతే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.
పెళ్లి అంతా ఒకెత్తు అనుకుంటే.. అంబానీల పెళ్లిలో సిత్రవిచిత్రాలెన్నో.. ఎన్నెన్నో. అంటిల్లా లోగిలిలో అడుగడుగునా ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకోవడంపైనా ప్రస్తుతం జనాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పెళ్లిలో బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలంతా విదేశీ అతిధుల్ని రిసీవ్ చేసుకునేందుకు - అలానే ప్లేటులో వడ్డిస్తూ కనిపించారు. పెళ్లిలో - పెళ్లయ్యాక రిసెప్షన్ లో ఒకటేమిటి.. అడుగడుగునా లెజెండరీ హీరోలే వంత పాడారు. అసలు ఇలాంటి విందు - కనువిందు ఎన్నడూ చూడలేదని విదేశీ సెలబ్రిటీలే కితాబిచ్చారు.
ఇక ఈ వేడుకలో అమీర్ ఖాన్ - అమితాబ్ - ఐశ్వర్యారాయ్ సహా ఎందరో అతిధులకు వడ్డనలు చేశారు. ఇక విదేశీలు ఫుల్లుగా తిని వెళుతూ వెళుతూ అంబానీలకు ఆహా ఓహో అని కాంప్లిమెంట్ ఇచ్చారు.. కొందరైతే కాళ్లపైనా పడ్డారు. ఇలాంటి వింత వింతలెన్నో చోటు చోసుకున్నాయి. ఇక అంబానీల పెళ్లిలో రకరకాల విఠలాచార్య సెట్టింగులు కన్నులపండుగ చేశాయి. కొన్ని సెట్టింగులు అయితే ఆశ్చర్యపరిచాయి. అంటిల్లా ముందు.. పింకు రంగు కలువ విచ్చుకుంటూ ఉన్న సెటప్ ఫెంటాస్టిక్ అంటే తప్పేం కాదు. ఆ భవంతి ముందు.. ఇలాంటి సెట్టింగులెన్నో చేశారట. మొత్తానికి రాజుగారు తలుచుకుంటే... కొండమీంచి కోతిని అయినా దించొచ్చు! అన్నట్టే సాగింది ఈ పెళ్లి వేడుక!!