తన భార్య తన నుండి విడిపోతోందని ఫేస్ బుక్ లో చెప్పేశాడు హీరో హృతిక్ రోషన్. సుజానే ఇక విడాకులు కోరుకుంటుందని యావత్ ఇండియాకి తనే తెలిపాడు. మొన్ననే హీరోయిన్ కొంకణా సేన్ శర్మ తన డైవర్స్ గురించి ఒక ట్వీటేసింది. మేము విడిపోవాలని నిశ్చయించుకున్నాం అంటూ తెలిపింది. అలాగే జీవితంలో కొన్ని సరిగ్గా జరుగుతాయి కొన్ని జరగవు అంటూ ఇన్ డైరెక్టుగా తన మ్యారేజ్ లైఫ్ గురించి సెలవిచ్చాడు విలక్షణ నటుడు సుదీప్ కూడా. మనోడు కూడా ట్వీట్ చేశాడులేండి. హాలీవుడ్ లో చాలా పాపులర్ నటీమణి కేటీ ప్రైస్ కూడా తన విడాకులు గురించి ఇలా సోషల్ సైట్లలోనే ప్రస్తావించింది. ఇక్కడే అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది.
అసలు లవ్ లైఫ్ గురించి అడిగినా, లేదా మీ పిల్లల గురించి చెప్పండి అని అడిగినా.. చాలామంది సెలబ్రిటీలు అదంతా మా పర్సనల్ గురూ అంటూ మీడియాకు క్లాసులు పీకుతుంటారు. అసలు ఎఫైర్ గురించి లవ్ గురించి గాళ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గురించి ఒక్క మాట చెప్పమన్నా కూడా కోపం వచ్చేస్తుంది. మా పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడాల్సిన పనేముంది.. మేమూ మనుషులమే మాకు మనస్సుటుంది.. ఏదో యాక్టర్లం అయినంత మాత్రాన మా పర్సనల్ లైఫ్ ను ఎర్ర తివాచీ మీద ఆరబోయాలా అంటూ మండిపతుంటారు. అంత పర్సనల్ అయినప్పుడు ఇలా డైవర్స్ విషయం రాగానే ఎందుకు దానిని సోషల్ సైట్స్ ద్వారా జనాలకు చెప్పడం?
ఏదో ఒక పేపర్ లో ఇంటర్యూ లో చెప్పడం వేరు, దానిని డప్పేసినట్లు సోషల్ సైట్లలో చెప్పడం వేరు. ఇక్కడ వేలాది మంది అభిమానులు హర్టు అవుతారు అనే పాయింట్ కంటే.. అసలు పర్సనల్ విషయాలు అనుకున్నప్పుడు దానిని పబ్లిక్ లో ఇలా రచ్చ చేయడం ఎందుకు అనేది పాయింట్. సానుభూతి పొందడానికా లేకపోతే అవతలి వారిని కాస్త కించపరచడానికి అనే సందేహం వస్తోంది.