2022: క్రిస్-క్రాస్ హాల్టర్ నెక్ లోవావ్ అనిపించిన‌ భామ‌లు!

Update: 2022-12-22 02:30 GMT
బాలీవుడ్ బ్యూటీల స్టైలింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌మ‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రిగా ప‌డాల్సిందే. డిజైన‌ర్ దుస్తుల్లో వీలైనంత ట్రెండీ గా మెప్పించ‌డానికి ట్రై చేస్తుంటారు. ఆల్ర్టా మోడ్ర‌న్ దుస్తుల్లో...సెగ‌లు పుట్టించే భంగిమ‌ల్లో క్యామ్ కి ఫోజులివ్వ‌డం అన్న‌ది అక్క‌డ బ్యూటీల‌కే చెల్లింది. ఈ విష‌యంలో న‌వ‌త‌రం భామ‌లు ఎక్కువ‌గా విదేశీ మోడ‌ల్స్ ని అనుక‌రిస్తున్నారు.

వివిధ చిత్రోత్స‌వాల్లో ది బెస్ట్ ఎంపిక‌ల్ని చూజ్ చేసుకుంటున్నారు. తాజాగా 2022 లో ఈ భామ‌లంతా త‌మ‌ అంద‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో మిగ‌తా భామ‌ల‌కంటే స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అయ్యార‌ని చెప్పొచ్చు.  ఇదిగో  ఇక్క‌డిలా  క్రిస్-క్రాస్ హాల్టర్ నెక్- ఛాతీ కట్-అవుట్- డ్రాస్ట్రింగ్ డిటైలింగ్ డిజైన్ లో  కొంత మంది భామ‌లు మెరుస్తున్నారు.

కటౌట్ డ్రాస్ట్రాంగ్ థై స్లిట్ హాల్టర్ డ్రెస్‌లో అందరి దృష్టిని త‌మ‌వైపు తిప్పుకుంటున్నారు. ఓ షోలో పాల్గొనేందుకు స‌మంత‌ గులాబీ రంగు ప్యాంట్ కి మ్యాచింగ్ గా రెడ్ క‌ల‌ర్ హాల్ట‌ర్ నెక్ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. అట్టికో నుండి పింక్ హై-వెయిస్ట్ మరియు ఫ్లేర్డ్ ప్యాంట్‌లతో జత చేయబడింది.  అలాగే `గెహ్రైయాన్`  ప్రమోషన్ కోసం దీపిక ప‌దుకొణే  ప్ర‌తీ ఈవెంట్ లోనూ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అయింది.

దీపికా పదుకొనే డెనిమ్ ప్యాంట్‌తో కలిపి అలిక్స్  ఎన్ వైసీ  బాడీ సూట్‌ను ధ‌రించింది.  అలాగే రెడ్ క‌ల‌ర్  లెదర్ ఫ్రాక్స్ లోనూ త‌ళుక్కున మెరిసింది. మ‌రో ఫోటో కోసం  క్రిస్-క్రాస్ హాల్టర్ నెక్‌లైన్ దుస్తుల్లోనూ త‌ళుకులీనింది. అలాగే  ఓ పార్టీ ఈవెంట్ కోసం హాట్ బ్యూటీ భూమీ ప‌డ్నేక‌ర్ మెటాలిక్ గౌనులో స్టైలింగ్ అయింది. అమ్మ‌డు మెరుపులు దుస్తుల్లో ఓ రేంజ్ లో మురిపించింది.

డోల్స్ అండ్  గబ్బానా యాంకిల్-స్ట్రాప్ హీల్స్‌తో జత చేయబడింది. క్రిస్-క్రాస్ మరియు ప్లంగింగ్ నెక్‌లైన్ హైలైట్. ఇక అన‌న్య పాండే క్రిస్ -క్రాస్ హాల్ట‌ర్ నెక్ లోనే రెండు..మూడు రంగుల డిజైన్ లో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.  కాపీ క‌ల‌ర్ లెద‌ర్ ప్యాంట్ లో అమ్మ‌డు మ‌రింత స్టైలిష్ గా హైలైట్ అవుతుంది. అలాగే జాన్వీ క‌పూర్..కియారా అద్వాణీ... అల‌య లాంటి యంగ్ బ్యూటీలు ఇదే నెక్ లైన్ డిజైన్  దుస్తుల్లో అబ్బ‌రు ప‌రిచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News