బాలయ్య చేసిన సైగతో ఇబ్బందేనా?

Update: 2017-08-10 09:54 GMT
మన సినిమాలులో బూతులు మాట్లాడటం కొత్త కాదు కానీ అవి మనకు వినిపించవు. ఏవో టెక్నికల్ సమస్యలు వలన మనకు వినపకుండా చేస్తారు లెండి. దాని అర్ధం అందరికీ తేటగా అర్ధమైనా ధర్మరాజు యుద్దం సమయంలో అశ్వత్థామ గురించి అబద్ధం చెప్పినట్లు అనిపిస్తుంది. అలా నర్మగర్భంగా చెబితే మాత్రం పర్వాలేదు మన సెన్సార్  బోర్డు వాళ్ళకి. ఇప్పుడు తెలుగులో  అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా పై కూడా సెన్సార్ కొన్ని ఆంక్షలు విధించింది అని తెలుస్తుంది.

పూరీ జగన్నాధ్ డైరక్షన్లో బాలయ్య హీరో గా నటిస్తున్న పైసా వసూల్ ట్రైలర్లో  బాలకృష్ణ ఒక ఫైట్ సీన్ లో మనం నిజ జీవితంలో బూతుగా పరిగిణించిన ఒక సైగను వాడాడు. ఇప్పుడు ఈ విషయంగానే సెన్సార్  వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు అని చెబుతున్నారు.  అలా ఉన్న సైగలను తొలిగిస్తేనే సినిమా కు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కత్తిరింపులు కూడా జరిగాయి అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆ ఒక్క దగ్గరే కాదు సినిమాలో బాలయ్య పాత్రకు అది ఊతపదం అని కూడా అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మాఫియా డాన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మరి అటువంటి పాత్ర ఎన్ని బూతులు మాట్లాడుతుందో మనం ఊహించుకోవచ్చు. సాధారణగా పూరీ సినిమాలలో కొన్ని బూతులుగా అనుకునే మాటలు సినిమాలో ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటాయి. ఆడియన్స్ కు ఇవన్నీ కొత్తకాదులే.

సెప్టెంబర్ 1 నాడు పైసా వసూల్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పాటలును ఈ నెల 17న ఖమ్మం లో ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. బాల కృష్ణ చాలా సినిమాలు తరువాత తన లుక్ ను  తన శైలిని పూర్తిగా మార్చి నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శ్రీయ శరణ్ మరియు ముస్కాన్ నటిస్తున్నారు. కైరా దత్ కూడా అందాలను దారబోస్తోందిలే.​
Tags:    

Similar News