అల్లరి నరేష్ హీరోగా ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ సినిమాలు మాత్రమే వచ్చాయి. ఒకటి రెండు కాస్త సీరియస్ పాత్రలు చేసినా కూడా అవి అల్లరి నరేష్ ను సీరియస్ హీరోగా చూపించలేక పోయారు. కమెడియన్ గా చేస్తున్న సినిమాలు సక్సెస్ కాకపోవడంతో అల్లరోడు ఈసారి పూర్తి స్థాయి సీరియస్ పాత్రను పోషించారు. నాంది అనే సినిమాలో అల్లరి నరేష్ ను కొత్తగా చూడబోతున్నాం.
ఈ సినిమా కోసం అల్లరి నరేష్ మొదటి సారి నగ్నంగా కూడా నటించాడు. ఇటీవల విడుదల అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సాగుతోంది. ఇటీవల సినిమా గురుంచి అల్లరి నరేష్ మాట్లాడుతూ పోలీస్ కస్టడీలో ఉన్న ఖైదీలను వారు ఎంతగా హింసిస్తారో చూపించే విధంగా సినిమా ఉంటుందని పేర్కొన్నారు.
పోలీసుల అరాచకాలు ఇందులో చూపిస్తామని నరేష్ పేర్కొన్నాడు. పోలీసుల గురించి మరి కఠినంగా చూపిస్తే సెన్సార్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినిమాకు ఇది రీమేక్. అయినా కూడా ఇక్కడ సెన్సార్ ఇబ్బంది తలెత్తే అవకాశం లేకపోలేదు అంటున్నారు. తాజా నరేష్ వ్యాఖ్యలతో నాంది సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.