యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకొని ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన చైతూ.. ''థాంక్యూ'' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి గుర్తుండిపోయే సినిమాని అందించిన విక్రమ్ కె కుమార్ ‘థాంక్యూ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం రిలీజ్ చేశారు.
నాగచైతన్య ను మూడు డిఫరెంట్ షేడ్స్ లో ఓవైపు క్లాస్ మరో వైపు మాస్ అనే విధంగా ప్రజెంట్ చేసిన 'థాంక్యూ' టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ టీజర్ 6 మిలియన్ల వ్యూస్ తో 200K లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
'థాంక్యూ' టీజర్ లో రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ వంటి ముగ్గురు హీరోయిన్లను పరిచయం చేసారు. నాగచైతన్య లైఫ్ లో ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. పీసీ శ్రీరామ్ విజువల్స్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి.
అలానే ఇందులో చైతూ చెప్పిన 'లైఫ్ లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను' 'నన్ను నేను సరి చేసుకోడానికి.. నేను చేస్తున్న ప్రయాణమే ఇది' వంటి సంభాషణలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇవి చై తన మాజీ భార్యని ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడినట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
'ఏమాయ చేసావే' సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంతను నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగో వెడ్డింగ్ యానివర్సరీకి కొన్ని రోజుల ముందు విడిపోతున్నట్లు ప్రకటించారు.
చై-సామ్ విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచీ వీరికి సంబంధించిన ప్రతీ విషయంలో మీడియా - సోషల్ మీడియాలు స్పెషల్ ఫోకస్ పెడుతూ వస్తున్నాయి. వీరి ఫ్యాన్స్ మధ్య వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరిలో తప్పెవరిది అనే విషయం మీద అనేక విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు 'థాంక్యూ' చిత్రంలో చైతూ నోటి నుంచి వచ్చిన మాటలు ఇన్ డైరెక్ట్ గా తన మాజీ భార్య సమంత గురించి అంటున్నవే అని కొందరు సిల్లీ విశ్లేషణలు చేస్తున్నారు. 'నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్' అంటూ రానా పెట్టిన కామెంట్ ని కూడా దీనికి లింక్ చేస్తున్నారు. ఈ డైలాగ్స్ సామ్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకముందు 'పుష్ప' సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసినప్పుడు కూడా.. పరోక్షంగా చై ని లక్ష్యంగా చేసుకుని చేసిందే అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. 'పెద్ద మనిషి లాగా ఫోజులు కొడతాడు.. మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు.. అంతా ఒకటే జాతి.. మగ బుద్దే వంకర బుద్ధి' అనే లిరిక్స్ ఆ విధంగా వచ్చినవే అని అన్నారు.