సమంతతో విడాకుల గురించి మొదటిసారి స్పందించిన చైతూ..!

Update: 2022-01-12 11:08 GMT
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న చై సామ్ జంట.. తమ ఏడేళ్ల ప్రేమకు నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలకడం అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే విడాకుల గురించి సమంత స్పందించినా.. చైతన్య మాత్రం ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటూ వచ్చారు. 'లవ్ స్టొరీ' మూవీ ప్రమోషన్స్ లో కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడగకుండా మీడియాకు దూరంగా ఉన్నారు. ఐతే తాజాగా సామ్ తో డివోర్స్ గురించి మొదటిసారి చై స్పందించారు.

నాగచైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ''బంగార్రాజు'' సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం విలేఖరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన లైఫ్ లో కఠినమైన రోజుల గురించి అడగ్గా.. కోవిడ్ కి సంబంధించా? అని తిరిగి ప్రశ్నించారు. సమంతతో విడాకుల గురించి అని చెప్పడంతో కొంచెం ఇబ్బందిగానే చైతూ సమాధానం చెప్పారు.

''ఇట్స్ ఓకే. టఫ్ డేస్ అనేం కాదు.. ఇట్స్ ఫైన్. అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం. ఆమె సంతోషంగా ఉంది.. నేను కూడా సంతోషంగా ఉన్నాను. ఈ పరిస్థితులుల్లో ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ ఇదే అనుకున్నాం'' అని నాగచైతన్య చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో ఫ్యామిలీ అంతా తనకు సపోర్ట్ గా నిలిచిందని చైతూ వెల్లడించారు.

సామ్ సోషల్ మీడియాలో పరోక్షంగా తన లైఫ్ గురించి పోస్టులు పెట్టడమే కాకుండా బాలీవుడ్ మీడియాతో విడిపోవడంపై స్పందించింది. మరోవైపు చైతన్య మాత్రం తన విడాకుల గురించి ఎక్కడా ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ మాట్లాడలేదు. ఎప్పటిలాగే మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో డివోర్స్ మీద నాగచైతన్య ఫస్ట్ టైం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఇకపోతే కెరీర్ మీద ఫోకస్ పెట్టిన నాగచైతన్య.. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే 'లవ్ స్టొరీ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు 'బంగార్రాజు' చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇదే క్రమంలో 'థాంక్యూ' 'లాల్ సింగ్ చద్దా' వంటి సినిమాలతో రాబోతున్నాడు. అలానే ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టబోతున్నారు.
Tags:    

Similar News