అఆ సక్సెస్ తర్వాత యాక్షన్ థ్రిల్లర్ తో ప్రయోగం చేద్దామని లైతో షాక్ తిన్న నితిన్ కొత్త సినిమా చల్ మోహనరంగ విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా గోప్యంగా హడావిడి లేకుండా పూర్తి చేసుకునే దశలో ఉంది. తాను ప్రాణంగా అభిమానించే పవన్ నిర్మాతగా, తన కెరీర్ డల్ ఉన్న టైంలో సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో నిర్మాతగా ఉన్న సినిమా కాబట్టి నితిన్ కు ఇది చాలా స్పెషల్ గా మారనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ రోజు విడుదల చేసారు. నితిన్ చాలా కూల్ గా తనకు బాగా సూట్ అయ్యే లవ్ బాయ్ తరహాలోనే ఇందులో కూడా కనిపిస్తున్నాడు. స్టొరీ దేని గురించి అని అంచనాకు వచ్చే అవకాశం లేకుండా చాలా సింపుల్ గా డిజైన్ చేసారు పోస్టర్స్.
దర్శకుడు కృష్ణ చైతన్య నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇదే. 2014లో నారా రోహిత్ రౌడీ ఫెలోతో దర్శకుడిగా మారిన ఈ గీత రచయిత ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. దాని తర్వాత ఆఫర్స్ వచ్చినా కూడా ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేసి ఒక తుదిరూపం ఇచ్చి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ఇంత టైం పట్టింది. హీరొయిన్ గా నితిన్ తో లైలో చేసిన మేఘా ఆకాష్ ఇందులో కూడా జోడి కట్టింది. ఈ మధ్య వరస సినిమాలతో జోరు మీదున్న తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఎప్పుడు విడుదల అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
టైటిల్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎవరు లేని ఇద్దరు కలిసి పాడుకునే పాత పాట ‘నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు’ లో నుంచి బాగా నానుడిలో ఉన్న చల్ మోహనరంగ అనే పదాన్నే ఇక్కడ తీసుకున్నారు. వ్యక్తిగతంగా భావుకుడు, గీత రచయిత అయిన కృష్ణ చైతన్య కథకు ఏదో లింక్ ఉండే ఈ పేరు పెట్టాడు అనుకోవాలి. టైటిల్- పోస్టర్ తోనే ఆకట్టుకున్న చల్ మోహనరంగలో విషయం చాలానే ఉన్నట్టు కనపడుతోంది. మరి పవన్ - త్రివిక్రమ్ నిర్మాతలుగా మొదటి సారి జట్టు కట్టిన సినిమా కాబట్టి మామూలుగా ఉండే ఛాన్స్ అయితే లేదు.