సినిమాల్లో కొందరు రొమాన్సుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. కొందరు యాక్షన్ తో గుర్తింపు సంపాదిస్తారు. కొందరు క్రూరమైన విలనీకి పేరుపడతారు. కొందరు ఐటెం సాంగ్స్ తో పేరు సంపాదిస్తారు. అలాగే తెలుగు సినిమాల్లో రేప్ సీన్లకు ఓ నటుడు చిరునామాగా మారిపోయాడు. ఆ నటుడు చలపతిరావు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన కెరీర్లో ఎన్ని రేప్ సీన్లలో నటించారో లెక్కల్లో చెప్పడం కష్టం. అలాంటి సీన్లు తన కెరీర్లో వందల్లో ఉండి ఉండొచ్చని అంటున్నారాయన. ఐతే తెరమీద అలాంటి పాత్ర చేస్తున్నానని.. తనకు రేపిస్ట్ ఇమేజ్ వచ్చిందని తానెప్పుడూ బాధపడలేదని చలపతిరావు చెప్పారు. తనను చూసి ఒకప్పుడు అమ్మాయిలు నిజ జీవితంలోనూ బాధపడేవారని.. తనను అసహ్యించుకునేవారని.. అది చూసి తాను ఎంజాయ్ చేసేవాడినని చలపతి రావు ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
తనపై జనాల్లో ఎలాంటి ఫీలింగుండేదో చెబుతూ.. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘నేను విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన సమయంలో ఒకసారి తన మేనత్తను చూడటానికి ఒంగోలు వెళ్లాను. నేను నటించిన ఓ సినిమా చూసేందుకు మా మేనత్తతో కలిసి థియేటరుకు వెళ్లాను. సినిమా మొదలయ్యాక ఎవ్వరికీ తెలియకుండా వెళ్లి థియేటర్లో వెనుక కూర్చున్నాను. అంతలో నేను రేప్ చేసే సీన్ వచ్చింది. తెర మీద అమ్మాయి నేనున్న చోటికి వస్తున్న సీన్ రాగానే.. నా ముందు కూర్చున్న ఓ అమ్మాయి చాలా బాధతో అరిచింది. ‘‘అక్కడ ఆ దుర్మార్గుడున్నాడమ్మా.. వస్తే రేప్ చేసేస్తాడమ్మా.. నువ్వు రావద్దమ్మా’’ అని అరవడం మొదలుపెట్టింది. నేను ఆసక్తిగా చూస్తున్నా. మా మేనత్త ఆ అమ్మాయిని వారించింది. నేను మంచోణ్నని చెబుతుంటే నేను అడ్డుకుని సైలెంటుగా ఉండమన్నా. జనాలు నా పాత్రలతో ఎంతగా కనెక్టయ్యారో చెప్పడానికి ఇది రుజువు’’ అని చలపతిరావు వెల్లడించారు.