ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు..!

Update: 2022-12-28 09:05 GMT
ప్రముఖ నటుడు.. పాత తరం విలన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు డిసెంబర్ 24న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల చిత్ర సీమలోని ప్రముఖులు.. రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. చలపతి మృతి వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

చలపతి రావు కుమారుడు నటుడు కమ్ డైరెక్టర్ రవి బాబును చిరంజీవి పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కాగా ఆయన కూతురు విదేశాల్లో ఉండగా హైదరాబాద్ రావడానికి ఆలస్యమైంది. ఈ క్రమంలోనే చలపతిరావు మృతదేహాన్ని మహాప్రస్థానంలో ఫ్రిజర్ బాక్స్ లో ఉంచారు. నేడు ఉదయం చలపతి మృత దేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

చలపతి రావు కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే హీరో మంచు మనోజ్.. నిర్మాతలు సురేష్ బాబు.. దామోదర ప్రసాద్.. రచయిత పరుచూరి గోపాల కృష్ణ.. దర్శకులు బోయపాటి శ్రీను.. శ్రీవాస్.. నటుడు గౌతమ్ రాజు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా చలపతి రావు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కమెడియన్ గా.. విలన్ గా నటించిన ప్రేక్షకులను మన్నలను పొందారు. నాటి తరం హీరోలైన ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. శోభన్ బాబు.. కృష్ణం రాజు సినిమాలతో పాటు ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్.. బాలకృష్ణ సినిమాల్లోనూ నటించారు.

 ప్రస్తుత తరంలో జూనియర్ ఎన్టీఆర్ సహా యంగ్ హీరోల సినిమాల్లో కన్పించారు. చలపతి రావు సుమారు 1200లకు పైగా సినిమా నటించారు. కాగా కొన్ని రోజుల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చలపతి రావు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 24న గుండెపోటు రావడంతో ఆయన మరణించడం విషాదంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News