తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపిచంద్ నటించిన 'చాణక్య' ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ లోనే గోపీచంద్ ఒక రా ఏజెంట్ గా నటిస్తున్న విషయం రివీల్ చేయడం జరిగింది. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ లో స్టొరీ గురించి ఇంకొన్ని హింట్స్ ఇచ్చారు.
గోపీచంద్ పాత్రకు రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ లో ఉద్యోగిగా సాఫ్ట్ గా రామకృష్ణ అనే పాత్రలో కనిపిస్తాడు. బ్యాంకులో ఉన్న మేనేజర్ రఘుబాబు తో కాస్త కామెడీ.. అక్కడికి వచ్చిన బ్యూటిఫుల్ మెహ్రీన్ తో లవ్వు.. ఇలా సాగుతూ ఉంటుంది. అయితే సడెన్ గా పాకిస్తాన్ లో ఒక సీక్రెట్ ఆపరేషన్ పై రా ఏజెంట్ గా కరాచీకి వెళ్తాడు. అక్కడ ఓ డేంజరస్ మిషన్ ను లీడ్ చేసే వ్యక్తిగా అర్జున్(గోపిచంద్) పాత్రలో పవర్ఫుల్ గా కనిపిస్తాడు. అయితే ఆ మిషన్ ఏదో తేడా కొట్టడంతో రా ఆఫీస్ అర్జున్ తో సంబంధాలు తెంచుకుంటుంది. అర్జున్ ను చంపేయాలని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తారు. ఒకవైపు తను పని చేస్తున్న రా ఏజెన్సీ.. మరోవైపు శత్రు దేశంలో ఉన్న శత్రువులు.. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో గోపిచంద్ ఏం చేశాడన్నది సినిమా కథ.
విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ ను ఎలివేట్ చేసిదిగా ఉంది. ఎప్పటిలాగే గోపీచంద్ యాక్షన్ సీక్వెన్సుల్లో పవర్ఫుల్ గా ఉన్నాడు. "చావుకు తెగించినోడు బుల్లెట్టుకు భయపడడు ఖురేషి" అని సీరియస్ సిట్యుయేషన్ తో కూల్ గా చెప్పినా.. బ్యాంక్ లో "వెయ్యిమందికి మిస్డ్ కాల్ ఇవ్వడానికే సాయంత్రం అవుతుంది.. ఇక లోనా(లోన్ కు ఒప్పించడమా)" అంటూ నీరసంగా బ్యాంక్ ఉద్యోగిలా చెప్పిన రెండూ రకాలుగా గోపి సెట్టయ్యాడు. ఓవరాల్ గా చూస్తే 'చాణక్య' తో గోపీచంద్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న హిట్టు దక్కేలానే ఉంది. ఆలస్యం ఎందుకు.. మీరూ ఒక లుక్కేయండి.
Full View