‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు యువ దర్శకుడు చందూ మొండేటి. వెంటనే అక్కినేని కాంపౌండ్ నుంచి అతడికి పిలుపు వచ్చింది. ‘కార్తికేయ’ లాంటి మరో విభిన్నమైన కథతో నాగచైతన్య హీరోగా సినిమా మొదలవుతుందని వార్తలొచ్చాయి. కానీ అనుకోకుండా మలయాళ ‘ప్రేమమ్’ రీమేక్ తెరమీదికి వచ్చింది. ఐతే రీమేక్ కాకుండా తన సొంత కథతోనే చందూ సినిమా తీయడానికి ఆసక్తి చూపించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ మాట వాస్తవమే అని ఓ ఇంటర్వ్యూలో చైతూనే స్వయంగా వెల్లడించాడు.
‘‘చందూ తన సొంత కథతోనే నాతో సినిమా చేయాలనుకున్నాడు. ఐతే మేమిద్దరం కలిసి ట్రావెల్ అవుతున్న టైంలోనే ‘ప్రేమమ్’ చూశాం. ఒక భాషలో అంత పెద్ద హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడానికి చందూ ముందు తటపటాయించిన మాట వాస్తవమే. ఐతే తర్వాత కన్విన్స్ అయ్యాడు. ఒరిజినల్ లో జరిగిన తప్పొప్పుల్ని సరిదిద్దాలనో.. దాన్ని మించి హిట్ చేయాలనో ఈ సినిమాను చేయడం లేదు.. కేవలం సోల్ తీసుకుని ప్రొసీడ్ అవుదామని అని ఇద్దరం గట్టిగా అనుకుని ఈ సినిమా చేశాం’’ అని చైతూ చెప్పాడు.
ఇక తనకు ‘ప్రేమమ్’ మీద కలిగిన ఆసక్తి గురించి చైతూ చెబుతూ.. ‘‘మలయాళంలో ఈ సినిమా చూడగానే ప్రేమలో పడిపోయాను. హీరో పాత్రకు బాగా కనెక్టయ్యాను. ఒకబ్బాయి పుట్టినప్పుడెలా ఉంటాడు. స్కూల్‌లో.. కాలేజీలో ఎలా ఉంటాడు? జీవితం మీద అవగాహన వచ్చాక ఎలా మారుతాడు.. లాంటి అంశాలు నాలో బాగా ఆసక్తి రేకెత్తించాయి’’ అని అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/