‘ప్రేమమ్’కు తెలుగు టచ్ బాగానే ఇస్తున్నారు

Update: 2016-07-18 06:56 GMT
ఉన్నదున్నట్లు తీస్తే జిరాక్స్ కాపీ అంటారు.. ఏవైనా మార్పులు చేస్తే మాతృకను చెడగొట్టారని అంటారు. రీమేక్ సినిమాలతో ఉన్న ఇబ్బంది ఇదే. ఇది కత్తి మీద సాములాంటి వ్యవహారం. ఐతే యువ దర్శకుడు చందూ మొండేటి మాత్రం ‘ప్రేమమ్’ సినిమాకు తెలుగు టచ్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు చెబుతున్నారు యూనిట్ సభ్యులు. మాతృకలోని ఫీల్ మిస్సవకుండానే.. తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు అదనపు ఆకర్షణలు జోడించే ప్రయత్నాలు చేస్తున్నాడట. మార్పులు తక్కువే చేసినా అవి ఆకట్టుకునేలా ఉంటాయట. మలయాళ వెర్షన్ లో పాటలన్నీ కూడా లోకల్ గానే ఉంటాయి.

ఐతే తెలుగు ప్రేక్షకులు పాటలు రిచ్ గా.. ఫారిన్లో ఉండాలని కోరుకుంటారు. అందుకే రెండు పాటల చిత్రీకరణ కోసం యూనిట్ సభ్యులతో కలిసి నార్వే వెళ్లాడు చందూ మొండేటి. అక్కడ హీరో హీరోయిన్లు నాగచైతన్య.. శ్రుతి హాసన్ ల మీద రెండు పాటలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట చిత్రీకరణ పూర్తయింది. ఇంకో పాట షూటింగ్ జరుగుతోంది. ఇది అవ్వగానే సినిమా మొత్తం పూర్తయిపోతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. ‘ప్రేమమ్’ మలయాళ వెర్షన్ కు సంగీతాన్నందించిన రాజేశ్ మురుగేశన్ తో పాటు మల్లూ వుడ్ కే చెందిన గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News