వరుడు కావలెను.. రోడ్డు ఎక్కిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్
మొత్తం మీద ఏదో రకంగా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ సంఖ్య ను పెంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు నానా రకాల ప్రయోగాలు చేస్తూ జనాలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. కొందరు జనాలకు మంచి చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం కోసం ఇన్‌ఫ్లూయెన్సర్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. కొందరు బైక్స్‌పై స్టంట్స్ చేస్తూ ఉంటే మరికొందరు నీళ్లలో విన్యాసాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. మొత్తం మీద ఏదో రకంగా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ సంఖ్య ను పెంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సయాలీ సావంత్ వంతు వచ్చింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన సయాలీ సావంత్ కి ఇన్‌స్టాలో దాదాపు 80 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తనకు సంబంధించిన పలు వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పు ఆ పాపులారిటీ మరింత పెంచుకునే ఉద్దేశ్యంతో ఒక ప్లకార్డు పట్టుకుని రోడ్డు మీదకు ఎక్కింది. తనకు సరైన వరుడు కావలెను, అతడు నా కంటే పొడువు ఉండవలెను అంటూ కొన్ని క్వాలిలీస్‌ను రాసి ఉన్న ప్లకార్డ్‌ను చేత పట్టి రోడ్డు మీద తిరిగింది. ముంబైలోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన తాజ్ హోటల్ వద్ద ఈమె ప్లకార్డ్‌తో తిరుగుతూ ఉన్న వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సయాలీ సావంత్ చేసిన ఈ పని వల్ల ఒక్కసారిగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సయాలీ తన కోసం ఒక వరుడిని ఎంపిక చేసుకోవడం కోసం ఇలాంటి పని చేసిందని, ఆమె నిజంగానే కొత్త జీవితం మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో ప్లకార్డుతో వరుడిని పట్టుకోవడం ప్రారంభించిందని ఆమె సన్నిహితులు కొందరు చెబుతూ ఉన్నారు. కానీ నెటిజన్స్ మాత్రం ఈమె కచ్చితంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ పని చేస్తుంది అంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
తాజ్ హోటల్ ముందు సయాలీ సావంత్ వరుడు కావాలి అంటూ ప్లకార్డ్ పట్టుకుని ఉండగా పలువురు ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ఆమెతో మాట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె గురించి తెలిసిన వారు పెళ్లికి తాము సిద్ధం అంటూ ముందుకు వచ్చారు. కొందరు ఇప్పటికే నేను కమిట్ అయ్యి ఉన్నాను, లేదంటే నిన్ను కచ్చితంగా పెళ్లి చేసుకునే వాడిని అంటూ చెబుతున్నారు. మొత్తానికి ఆమె కంటే అందంగా, పొడవుగా ఉన్న వ్యక్తి, అన్ని విధాలుగా సయాలీకి సెట్ అయ్యే వ్యక్తి లభించేనా లేదంటే, చివరకు ఇది పబ్లిసిటీ స్టంట్ మాదిరిగానే నిలిచేనా అనేది చూడాలి.