రీరైట్ చేశానంటున్న చందూ మొండేటి

Update: 2016-10-04 07:51 GMT
‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేయడానికి యువ దర్శకుడు చందూ మొండేటి ముందు అంత ఆసక్తి చూపించలేదని అక్కినేని నాగచైతన్య ఈ మధ్యే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి చందూ తర్వాత ఎలా కన్విన్స్ అయ్యాడు.. ‘కార్తికేయ’ లాంటి ఒరిజినాలిటీ ఉన్న మంచి థ్రిల్లర్ తీసిన వాడు.. రీమేక్ సినిమా చేసేందుకు ఎలా అడ్జెస్టయ్యాడు..? అతడి మాటల్లోనే విందాం పదండి.

‘‘నేను.. చైతూ వేర్వేరుగా ఈ సినిమా చూశాం. ఇష్టపడ్డాం. మా నిర్మాతకు కూడా ఈ సినిమా నచ్చింది. కొన్ని రోజుల్లోనే దాదాపు పది మంది నిర్మాతలు ‘ప్రేమమ్’ రీమేక్ కోసం చైతూను అడిగారు. అప్పుడే ఈ రీమేక్ విషయంలో సీరియస్ గా దృష్టిసారించాం. రీమేక్ సినిమా చేయాలా అని తటపటాయిస్తూనే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత నా ఆలోచన మారింది. ప్రేమమ్ మలయాళ వెర్షన్లో అక్కడి నేటివిటీ ఉంటుంది. చాలా మలయాల సినిమాల రెఫరెన్సులుంటాయి. దీంతో స్క్రిప్ట్ మొత్తం రీరైట్ చేయాల్సి వచ్చింది. ఓ పది రోజులు పని చేశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నా చేతిలో మంచి స్క్రిప్ట్ ఉన్న ఫీలింగ్ కలిగింది. ఒరిజినల్ తో పోల్చి చూడకుండా చూస్తే ‘ప్రేమమ్’ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఈ విషయంలో గ్యారెంటీ ఇవ్వగలను’’ అని చందూ చెప్పాడు.

‘ప్రేమమ్’ రీమేక్ విషయంలో ఉన్న సందేహాలన్నీ..  ‘ఎవరే’ పాట రిలీజయ్యాక పక్కకు వెళ్లిపోయాయని.. సోషల్ మీడియాలో జరిగిన వ్యతిరేక ప్రచారం సినిమా బిజినెస్ విషయంలో ఏమాత్రం ప్రభావం చూపలేదని.. ఇలాంటి వాటిని తమ నిర్మాత చాలా లైట్ తీసుకున్నారని చందూ చెప్పాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News