ఆ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ చేసి ఉంటేనా!

Update: 2016-10-08 17:30 GMT
‘ప్రేమమ్’ సినిమాలో నెగెటివ్ పాయింట్స్ అంటూ వెతికితే చాలా తక్కువ కనిపిస్తాయి. అవి చాలా మైనర్ అనే చెప్పాలి. తెలుగు వెర్షన్ కోసం చందూ మొండేటి చేసిన మార్పులు.. జోడించిన ఆకర్షణలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా మూడో లవ్ స్టోరీలో శ్రీనివాసరెడ్డి పాత్రతో పండించిన వినోదం హైలైట్. తెలుగు వెర్షన్లో మూడో లవ్ స్టోరీ లెంగ్త్ పెంచి.. మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు చందూ.

ఐతే మలయాళ వెర్షన్లో ఉన్న హైలైట్ ఏంటంటే.. చివర్లో హీరో పెళ్లాడే ముందు హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకునే వ్యక్తిగా స్వయంగా దర్శకుడు అల్ఫాన్సో పుతెరినే కనిపించాడు. అతడి క్యామియోకు అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాత్రను తెలుగులో నోటెడ్ యాక్టర్ తో చేయిస్తే ఇంకా బాగుండేది. కానీ ఆ క్యారెక్టర్ని ఎవరో కొత్తబ్బాయితో చేయించాడు చందూ. అలాంటి రోల్ లో వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ చేసి ఉంటే మరింత హిలేరియస్ గా అనిపించేది. ఇలాంటి సీన్లను కిషోర్ భలేగా పండిస్తాడు. అతడి కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అవుతుంది.

ఐతే అక్కడున్న నటుడు ఎవరన్నది పక్కనబెడితే.. ఈ పాత్ర చుట్టూ పండించిన వినోదం బాగా హైలైట్ అయింది. మంచి వినోదాన్ని పంచింది. ఈ సీన్లో సోగ్గాడే చిన్నినాయనా తరహాలో నాగచైతన్య అండ్ కో వైట్ అండ్ వైట్లో అదరగొట్టేశారు. క్లైమాక్స్ ముందు కొసమెరుపులా ఉంటుంది ఈ సన్నివేశం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News