టాలీవుడ్ లో ఎంతో మంది లెజెండ్రీ నటీ నటులు ఉన్నారు. వారిలో చంద్ర మోహన్ ఒకరు అనడంలో సందేహం లేదు. దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే వచ్చారు. వెయ్యికి కాస్త తక్కువగా ఈయన సినిమాల సంఖ్య ఉంది. ఇంతటి సీనియర్ స్టార్ చంద్ర మోహన్ తన నటన కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించాడు. ఇటీవల 81వ వసంతంలోకి అడుగు పెట్టిన చంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ తన సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ఈ సుదీర్ఘ నటన కెరీర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశాను అనే సంతృప్తి మిగిలిందని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యం కారణంగా పలువురు నిర్మాతలు ఇబ్బంది పడ్డారని చంద్ర మోహన్ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య కారణం మరియు కోవిడ్ కారణాల వల్ల ఈమద్య కాలంలో సినిమాలు చాలా తగ్గించాను. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నేను చాలా సార్లు సమస్యను ఎదుర్కొన్నారు. ఇనుముకు చెదలు పడుతుందా అన్నట్లుగా భావించి ఎప్పుడు కూడా ఆరోగ్యం విషయంలో శ్రద్దను కనబర్చలేదు. ఎన్టీఆర్ రాఖీ సినిమాలో నటించిన సమయంలో ఆరోగ్యం బాగా లేదు. ఆ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశం చేసి నేరుగా ఆసుపత్రికి వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఇక అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా నా అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.
పలు సినిమాలు కూడా నా వల్ల ఆలస్యం అవ్వడంతో పాటు నిర్మాతకు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశాయి. అందుకే నేను ఇకపై సినిమాల్లో నటించకుండా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. నేను సినిమాలు మానేసినా కూడా నేను నటించిన ఏదో ఒక సినిమా ప్రతి రోజు ఏదో ఒక ఛానెల్ లో వస్తూనే ఉంటుంది. యూట్యూబ్ లో నా సినిమాలు ఎన్నో ఉన్నాయి. కనుక నేను ఇప్పటికి కూడా రెగ్యులర్ గా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటాను అనే అభిప్రాయంను చంద్ర మోహన్ వ్యక్తం చేశారు. ఇకపై కొత్త సినిమాలను ఆయన ఒప్పుకునేది లేదంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం పరంగా బాగానే ఉన్నానంటూ ఈ 81 ఏళ్ల సీనియర్ నటుడు చెప్పుకొచ్చాడు.