‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం పట్ల అందరిలోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు లభించే విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. ఈ విషయంలో ఇంకా ఉత్తర్వులు రాకపోయినా కంగారేమీ లేదు. ఎందుకంటే అది లాంఛనమే అని అందరికీ తెలుసు. ఈ లోపు తెలంగాణలో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య వెళ్లి ఆయన్ని కలిసి ధన్యవాదాలు కూడా చెప్పారు. శాతకర్ణిని ఆంధ్రుడిగా చూడకుండా.. అందులోనూ బాలయ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా అని ఆలోచించకుండా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి పెద్ద మనసును చాటుకున్నాడు కేసీఆర్.
ఐతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓ సినిమాకు చేసిన అన్యాయం గురించి ప్రస్తావించాలి. ఆ సినిమా మరేదో కాదు.. రుద్రమదేవి. ఈ సినిమా కూడా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిందే. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీని గుణశేఖర్ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తీశాడు. ఓరుగల్లు నుంచి పాలించింది కాబట్టి రుద్రమదేవిని తెలంగాణ వనితగా చూడలేం. ఆమె కథతో తీసిన సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో పన్ను మినహాయింపు ఇవ్వకూడదని ఏమీ లేదు. చరిత్రలో నిలిచిపోయిన ధీర వనిత మీద సినిమా తీసినపుడు దానికి ప్రాంతీయతను ఆపాదించి పన్ను మినహాయింపు ఆపాల్సిన అవసరం లేదు. ఐతే అప్పట్లో గుణశేఖర్ విజ్నప్తిని చంద్రబాబు మన్నించలేదు. ‘రుద్రమదేవి’కి పన్ను మినహాయింపు ఇవ్వలేదు. చంద్రబాబు కనికరించి ఉంటే గుణశేఖర్ చాలా వరకు సేఫ్ అయ్యేవాడు. తెలంగాణలో పన్ను మినహాయింపు అతడికి గొప్ప ఊరటనిచ్చింది. ఆంధ్రలోనూ ఇలా జరిగి ఉంటే నష్టాలేమీ లేకుండా బ్రేక్ ఈవెన్ కు వచ్చేవాడు. కానీ బాబు ఉద్దేశమేంటో కానీ.. పన్ను మినహాయింపు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి కూడా మినహాయింపును ఆపేస్తే అందరికీ ఒకే విధానాన్ని పాటించినట్లువువుతుంది. అలా కాకుండా దీనికి మినహాయింపునిస్తే మాత్రం ‘రుద్రమదేవి’కి అన్యాయం చేసినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/